
Hyderabad new flyover: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA)లు
సంయుక్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వాసులకు హెచ్ఎండీఏ మరో భారీ శుభవార్త అందించింది. నగరంలో ఉన్న రాష్ట్ర అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు ఒక సరికొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది.
Read also: Meenakshi Natarajan Nomination Rejection: ఇది పక్కా ప్లానే.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఫైర్!
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో, అలాగే వీఐపీల రాకపోకల తరుణంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. దీనికి తోడు నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాల రద్దీ తోడవడంతో సామాన్య ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హెచ్ఎండీఏ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అసెంబ్లీ వెనుక భాగంలో సుమారు 1.5 కిలోమీటర్ల మేర “వై” (Y) ఆకారంలో ఈ కొత్త ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. నాంపల్లి నుంచి లక్డీకాపూల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాల కోసం వన్ వే (One Way) విధానంలో ఈ వంతెనను డిజైన్ చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే 99 శాతం విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు నష్టం వాటిల్లకుండా, కేవలం ప్రభుత్వ భూములను మాత్రమే సేకరించి దీనికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను అధికారులు ఖరారు చేశారు. రూట్ మ్యాప్ ప్రకారం.. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ముందు భాగం నుంచి ఈ ఫ్లైఓవర్ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ వెనుక భాగం, రైల్వే లైన్ మీదుగా సాగుతూ లక్డీకాపూల్ జంక్షన్ వద్దకు చేరుకుంటుంది.
ఈ ఫ్లైఓవర్ యొక్క ప్రధాన ప్రత్యేకత లక్డీకాపూల్ జంక్షన్ వద్ద కనిపిస్తుంది. జంక్షన్ వద్దకు రాగానే ఈ వంతెన “వై” (Y) ఆకారంలో రెండు మార్గాలుగా చీలుతుంది. మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే వాహనదారుల కోసం ఒక మార్గం, ఖైరతాబాద్ వైపు వెళ్లే వారి కోసం మరో మార్గాన్ని కేటాయించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కంటే ముందే లక్డీకాపూల్ మెయిన్ రోడ్డుపై ఈ ఫ్లైఓవర్ ల్యాండ్ అయ్యేలా ఇంజనీర్లు పక్కా ప్లాన్ రూపొందించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నాంపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎలాంటి సిగ్నల్స్ , ట్రాఫిక్ రద్దీ లేకుండా నేరుగా మసాబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు వేగంగా ప్రయాణించవచ్చు.
Suvendu Adhikari: టాటా గ్రూప్‌ను తిరిగి బెంగాల్‌కు తీసుకొస్తాం.. ముఖ్యమంత్రి సువేందు సంచలన ప్రకటన
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Govt Petrol Diesel Purchase : పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం
Apple iphone 17 pro max discount: భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర
AP medical recruitment: ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Meenakshi Natarajan’s Rajya Sabha nomination : రాజ్యసభ నామినేషన్ కేసు.. రేపటికి వాయిదా
DK Shivakumar: సీఎం అయ్యాక తొలిసారి ప్రధాని మోదీతో డీకే శివకుమార్ భేటీ
India A vs Afghanistan A: అఫ్గానిస్తాన్‌పై భారత బ్యాటర్ల విధ్వంసం.. 349 పరుగుల భారీ టార్గెట్!