Tax Notice: జీతం పొందే చాలా మంది పన్ను చెల్లింపుదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. జనవరి నుంచి మార్చి 2026 మధ్య కంపెనీ మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS)
మొత్తాన్ని భారీగా పెంచడంతో ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ జీతాలు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. అయితే, చాలా మంది ఉద్యోగులకు ఆ షాక్ అంతటితో ముగియలేదు. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి (AY) ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, వారు ఇప్పుడు ఒక అదనపు భారాన్ని గుర్తిస్తున్నారు. అదేమిటంటే అడ్వాన్స్ టాక్స్ (ముందస్తు పన్ను) తక్కువగా చెల్లించినందుకు పడే వడ్డీతో పాటు, గణనీయమైన మొత్తంలో 'సెల్ఫ్-అసెస్మెంట్ టాక్స్' చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే ట్రెండ్ ట్యాక్స్ ఇయర్ 2026-27కు కొనసాగనుంది. ఉద్యోగులు అందించే సమాచారం ఆధారంగా టీడీఎస్ కట్ అవుతుంది. ఇది ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ను ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులు తెలియకుండా చేసే 5 తప్పులు ట్యాక్స్ నోటీసులు వచ్చేలా చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం.పాత కంపెనీలోని శాలరీ, ఇతర ఆదాయాల వెల్లడి ఉద్యోగులు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారడం లేదా ఇతర ఆదాయం ఉన్నప్పుడు ఫారం 122ను కొత్త కంపెనీకి వీలైనంత త్వరగా అందించాలి. దీనివల్ల, ఆదాయం (TDS, TCS వివరాలతో సహా) గురించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, కొత్త కంపెనీ TDSని మరింత కచ్చితంగా లెక్కించడానికి వీలవుతుంది. ఒక వేళ పాత వివరాలు ఇవ్వకపోతే ఐటీఆర్‌లో తేడాలు వచ్చి నోటీసు వస్తుంది.ఫారం 124లో పెట్టుబడి వివరాలను పెంచి చూపించొద్దు చాలా మంది ఉద్యోగులు ఏడాది పొడవునా తమ చేతికి వచ్చే జీతాన్ని పెంచుకునే ఉద్దేశంతో, పన్ను మినహాయింపులు, తగ్గింపులను పొందేందుకు ప్రతిపాదిత పెట్టుబడులు, చెల్లింపుల మొత్తాలను వాస్తవానికి మించి ఎక్కువగా చూపిస్తుంటారు. ఒకవేళ ఆ పెట్టుబడులు లేదా అర్హత కలిగిన చెల్లింపులు చివరికి జరగకపోతే, ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జరగాల్సిన TDS సర్దుబాటు (రికవరీ) వల్ల నెలవారీ నగదు ప్రవాహాలపై గణనీయమైన ప్రభావం పడవచ్చు. కాబట్టి, ఉద్యోగులు వాస్తవికంగా, సాధించగలిగే క్లెయిమ్‌లను మాత్రమే వెల్లడించాలి.ఫారం 124లో పేర్కొన్న వివరాల ఆధారాలను సమర్పించాలి ఆదాయపు పన్ను నియమాలు, 2026లోని రూల్ 205 ప్రకారం, TDS కోతలను లెక్కించేటప్పుడు అటువంటి క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకునే ముందు యజమాని పలు అంశాలకు సంబంధించిన క్లెయిమ్‌ల కోసం డాక్యుమెంటరీ ఆధారాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అందులో హౌస్ రెంట్ అలవెన్సులు, లీవ్ ట్రావెల్ కన్సేషన్, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్, ఇతర ఆమోదిత డిడక్షన్లు, మినహాయింపులకు సంబంధించిన పత్రాలను సమర్పించాలి.అడ్వాన్స్ టాక్స్ గడువు తేదీకి ముందే ఆదాయాన్ని అంచనా వేయాలి త్రైమాసిక అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు గడువు తేదీలకు ముందే ఉద్యోగులు తమ మొత్తం వార్షిక ఆదాయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. ఇలా ముందుగానే అంచనా వేసుకోవడం ద్వారా, ఆర్థిక సంవత్సరం చివరలో భారీ 'సెల్ఫ్-అసెస్మెంట్ టాక్స్' భారం పడటం లేదా అడ్వాన్స్ టాక్స్ తక్కువగా చెల్లించడం, వాయిదా వేయడం వల్ల వడ్డీ భారం పడటం వంటి ఊహించని పన్ను సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.ఫారం 26ఏఎస్, ఏఐఎస్ క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలి ఉద్యోగులు క్రమం తప్పకుండ ఫారం 16ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)లను ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా అందులో ఉండే పొరపాట్లను, నకిలీ ఆదాయాలు, టీడీఎస్ వ్యత్యాసాలు, హై-వాల్యూ ట్రాన్సాక్షన్ టైమ్ వంటివి తెలుసుకుని సమరి చేసుకునే వీలు కలుగుతుంది. ఇలా చేయకపోవడం వల్ల ఐటీ రిటర్నుల్లో వ్యత్యాసాలు ఏర్పడి నోటీసులు అందే ప్రమాదం ఉంటుంది.