
బక్సర్: సాధారణంగా విలువైన ఆభరణాలు, వస్తువులు.. వాహనాలు కూడా చోరీకి గురవుతుండటం చూస్తుంటాం. కానీ, బిహార్‌లో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లాలో ఏకంగా ఓ భారీ మొబైల్ టవర్‌తోపాటు జనరేటర్
మాయం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
బక్సర్‌కు సమీపంలోని దుమ్రావ్ పట్టణంలో 2010లో ఓ ప్రైవేటు టెలికాం సంస్థ 132 అడుగుల టవర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం స్థలం యజమాని హరేనాథ్ యాదవ్‌తో 12 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. అయితే, అది 2022తో ముగిసిపోయింది. అప్పటి నుంచి యజమానికి ఆ కంపెనీ నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో ఆయన టెలికాం సంస్థకు పలుమార్లు నోటీసులు పంపించాడు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదని సమాచారం.
ఈ క్రమంలోనే ఇటీవల మరమ్మతుల కోసం అక్కడకు చేరుకున్న కంపెనీ ప్రతినిధులు.. జనరేటర్‌తో సహా టవర్ లేకపోవడం చూసి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సుదీర్ఘ కాలంగా టవర్ ఇక్కడే ఉందని, గత 15-20 రోజులుగానే కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పని ఎవరు చేసుంటారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, స్థలం యజమానిని కూడా ప్రశ్నిస్తామని జిల్లా పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.