
భారత విదేశాంగ శాఖ మరోసారి దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేసింది. గత నాలుగు రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై అమెరికా మూడు సార్లు దాడులు చేసింది. గురువారం
కూడా ఓ నౌకపై దాడి జరగ్గా 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. దీన్ని ఖండించిన భారత్ తాజాగా అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఓ నౌకపై దాడి ఘటనలో.. ముగ్గురు భారతీయులు గల్లంతైన సమయంలోనూ భారత్ సమన్లు జారీ చేసింది. అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు |