
మధ్యలో ఆగిపోయిన మెట్రో లిఫ్ట్ గంటలపాటు లిఫ్ట్‌లోనే యువకుడు టెక్నీషియన్ సహాయంతో సురక్షిత రక్షణ Skywalk Lift: ఉప్పల్‌లోని 6-బీ స్కైవాక్ లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఓ యువకుడు దాదాపు ఏడు గంటలపాటు తీవ్ర
భయాందోళనకు గురైన ఘటన కలకలం రేపింది. రాహుల్ (20) అనే యువకుడు ఉప్పల్‌లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఎన్ఆర్పీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తున్న సమయంలో గురువారం రాత్రి స్కైవాక్ లిఫ్ట్ (Skywalk Lift)ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో అతడు లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయాడు. Scented Spirals: మరీ టూమచ్ బాసూ… ‘దోమల చక్రం’ రూ.6500.. బాక్స్ తో కొంటె రూ. 17,000 అంట సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే లిఫ్ట్ తలుపులు తెరవడం సులభం కాకపోవడంతో రాహుల్‌ను బయటకు తీసేందుకు గంటల తరబడి ప్రయత్నాలు కొనసాగాయి. లిఫ్ట్‌లో ఒంటరిగా చిక్కుకుపోవడంతో యువకుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు అధికారులు దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించినప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు టెక్నీషియన్ సహాయంతో శుక్రవారం తెల్లవారుజామున 1:15 గంటల సమయంలో రాహుల్‌ను సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కృష్ణా కన్స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్ఎండీఏ అధికారుల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతోనే సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.