
2026 జూన్ 13న అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే శని త్రయోదశి శని దోషాల నివారణకు, ఐశ్వర్య యోగానికి విశేషమైనది
Shani Trayodashi 2026 Astrological Remedies: రేపు శనివారం శని పూజకు అత్యంత ప్రత్యేకమైనది. ముఖ్యంగా 2026 జూన్ 13న అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి వస్తోంది. కాబట్టి, ప్రస్తుతం శని మహాదశ లేదా అంతర్దశలో ఉన్నవారు రేపు ప్రత్యేకంగా శని పూజ చేయడం ద్వారా శని ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చు.
సాధారణంగా శనివారం నాడు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. శని దేవుని అనుగ్రహం వల్ల మనం అనేక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. శని దేవుడు మన కర్మల ఆధారంగానే ఫలితాలను ఇస్తాడు. అయితే, శనివారం రోజు శనిదేవుడికి విశేష పూజలు నిర్వహించడం వల్ల శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది.
ముఖ్యంగా ఈసారి జూన్ 13, 2026 శని త్రయోదశి అధిక జ్యేష్ఠ మాసంలో రావడం వల్ల ఇది మరింత విశిష్టమైనది. ఈ రోజున శని దేవాలయాలను సందర్శించి తైలాభిషేకం వంటివి చేయడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా శని మహాదశ లేదా అంతర్దశ నడుస్తున్న వారు, తమ జన్మరాశిపై శని ప్రభావం ఉన్నవారు, ఏలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్న వారు, అలాగే ఉద్యోగ, వ్యాపార, కోర్టు వ్యవహారాలు లేదా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడే వారు ఈ ప్రత్యేక పూజలు తప్పక చేయాలి.
నల్ల నువ్వుల నూనెతో శని మందు దీపం వెలిగించి, "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నల్ల నువ్వులు, వస్త్రాలు, ఇనుప వస్తువులను దానం చేయాలి; కాకులకు ఆహారం అందించడం కూడా శ్రేయస్కరం.
శనివారం నాడు వృద్ధులకు, దివ్యాంగులకు బట్టలు లేదా ఇతర వస్తువులను దానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ శని త్రయోదశి రోజున హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల శని దేవుని శుభదృష్టి మీపై ఉంటుంది, దోషాలు తొలగిపోతాయి.
శని దోషాల నుండి ఉపశమనం పొందాలనుకునే మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన రాశి వారు ఈ ప్రత్యేక శని పూజను నిర్వహించుకోవడం ద్వారా అత్యంత విశేషమైన ఫలితాలను పొందుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)