
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Hindi Actress:లాఫ్టర్ చెఫ్ షోలో భాగంగా ఒక సెలబ్రిటీ పేరును గుర్తించే గేమ్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి నందినికి "తమిళనాడు సీఎం ఎవరు?" అనే ప్రశ్న అడిగారు. అయితే ఆమెకు వెంటనే సమాధానం తెలియకపోవడంతో "తెలియదు" అని చెప్పింది.
దీంతో పక్కన ఉన్న వారు ఆమెకు ఒక క్లూ ఇచ్చారు. "సూపర్ స్టార్" అని చెప్పడంతో నందిని వెంటనే "అల్లు అర్జున్?" అని ప్రశ్నించింది. ఆమె సమాధానం విన్న వెంటనే అక్కడున్న వారంతా నవ్వేశారు. అప్పుడు "కాదు" అని చెప్పగా, నందిని "మీరే సూపర్ స్టార్ అన్నారు కదా" అంటూ స్పందించింది.
ఆ తర్వాత మరో క్లూ ఇచ్చారు. "విజయ్" అని చెప్పగానే నందిని వెంటనే "విజయ్ దేవరకొండ?" అని అడిగింది. కానీ అది కూడా సరైన సమాధానం కాదు. ప్రశ్నకు సంబంధించిన వ్యక్తి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అని చెప్పిన తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ వీడియోపై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండల క్రేజ్ దేశవ్యాప్తంగా ఎంతగా ఉందో దీనివల్ల తెలుస్తోందని అంటున్నారు. మరికొందరు మాత్రం తమిళ స్టార్ విజయ్ను గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల తెలుగు హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు ఉత్తర భారతదేశంలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. వారి సినిమాలు హిందీలో డబ్ అయి పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందుకే నందిని వెంటనే వారి పేర్లను గుర్తు చేసుకుని చెప్పి ఉండొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.