
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
When to Get an MRI Scan for Headache: చాలా మందిలో వారానికి ఒకసారి తలనొప్పి రావడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా మహిళలు ఇంటి బాధ్యతలు, ఆఫీసు పనుల మధ్య సమతుల్యత (work-life balance) పాటించాల్సి రావడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, తలనొప్పి వచ్చిన ప్రతిసారీ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోనక్కర్లేదు. మైగ్రేన్, టెన్షన్ హెడేక్, బ్రెయిన్ ట్యూమర్ లేదా ఇతర నరాల సంబంధిత సమస్యలు ఉన్నాయని అనుమానం కలిగితే మాత్రమే వైద్యులు ఎంఆర్ఐని సూచిస్తారు. ఆ పరీక్షల అనంతరం అవసరమైన మందులు, క్రమం తప్పని చెకప్‌లను వైద్యులు అందిస్తారు.
తలనొప్పికి ఎందుకు ఎంఆర్ఐ చేయించుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెస్సోనెన్స్ ఇమేజింగ్. ఇది శక్తివంతమైన అయస్కాంతాల ద్వారా మెదడులోని కణజాలాల స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. దీని ద్వారా మెదడులో ఉన్న సమస్యలను వైద్యులు ఖచ్చితంగా అంచనా వేయగలరు. అందుకే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనిని సిఫార్సు చేస్తారు.
సర్వోదయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అభినవ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, ఒకవేళ మీకు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొన్నిసార్లు తలనొప్పి అనేది ప్రాణాంతక సమస్యలకు సంకేతం కావచ్చు. తలనొప్పితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా గమనించాలి. ముఖ్యంగా చేతులు, కాళ్లు బలహీనపడటం, మాట పలకడంలో ఇబ్బంది, తల తిరగడం, చూపు మందగించడం వంటివి కనిపిస్తే వెంటనే న్యూరో డాక్టరును కలవాలి. 50 ఏళ్లు పైబడిన వారికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇమ్యూనిటీ సమస్యలు లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన కారణాల వల్ల కూడా తలనొప్పి రావచ్చు, అటువంటప్పుడు ఎంఆర్ఐ అవసరం అవుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రతి తలనొప్పికి ఎంఆర్ఐ అవసరం లేదు. మెదడులో ట్యూమర్, స్ట్రోక్, ఇన్ఫెక్షన్, రక్తనాళాల్లో మార్పులు లేదా స్కల్ ప్రెషర్ వంటి సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే మాత్రమే దీనిని సూచిస్తారు. కొందరిలో తలనొప్పి తాత్కాలికంగా వచ్చి పోతుంది, అది సాధారణమే కావచ్చు. కానీ, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మరియు అవసరమైతే ఎమ్మారై చేయించుకోవడం శ్రేయస్కరం.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.