యానివర్సరీ ఈవెంట్‌కి శ్రుతి ఇంకా రావడం, ఎక్కడికి వెళ్లిందో అని రవి కంగారు పడుతుంటారు. ఏదో తేడా కొడుతోంది అని రోహిణి, మనోజ్‌లకు డౌట్ వస్తుంది. ఇక డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది రా అని ప్రభావతి
, కామాక్షి అంటుంది. దీంతో శ్రుతి వాళ్ల అమ్మని డ్యాన్స్ చేయమని అంటాడు. నాకు అలవాటు లేని పని కదా.. కష్టం అవుతోందని.. నేను చేయలేను అని వెళ్లిపోతుంది. దీంతో మళ్లీ ప్రభావతి, కామాక్షిలను స్టేజ్ మీదకు తీసుకు వెళ్లి డ్యాన్స్ చేయమని చెబుతాడు రవి. దీంతో ఆ ఇద్దరికీ నీరసం వస్తున్నా కూడా డ్యాన్స్ చేస్తుంటారు. మరో వైపు బాలు, మీనా ఇద్దరూ శ్రుతి కోసం వెతుకుతుంటారు. నువ్వు డ్యాన్స్ చేయడం ఏంటి? అని శ్రుతి మదర్ని సురేంద్ర తిడతాడు. మరో వైపు రవితో రాజేష్ కామెడీ చేస్తాడు. బాలుకి రవి ఫోన్ చేసి శ్రుతి దొరికిందా? అని అడుగుతాడు. ఇంకా లేదు.. అంత వరకు అక్కడ మ్యానేజ్ చెయ్యి రా అని బాలు సలహా ఇస్తాడు. ఇక్కడ కామాక్షి అత్త, మీ అమ్మ డ్యాన్స్ అదరగొడుతున్నారు అని రాజేష్ కామెడీ చేస్తాడు. అరెరె మిస్ అయ్యామే అని బాలు కూడా రవిని నవ్వించే ప్రయత్నం చేస్తాడు.శ్రుతికి కోపం వస్తే.. ఇంకో వైపు సురేంద్రకి కూడా అనుమానం వస్తుంది. రవి చూడు ఏదో కంగారు పడుతున్నాడు.. ఏం జరిగి ఉంటుందో అడుగుదామని అనుకుంటారు. ఏంటి బాబు.. ఏమైనా గొడవ జరిగింది.. మా శ్రుతి ఎప్పుడూ ఇంతే.. ఏదైనా తనకు నచ్చని, కోపం తెప్పించే ఘటన జరిగితే ఇలానే వెళ్లిపోతుంది.. ఓ సారి కేక్ నచ్చలేదని బర్త్ డే పార్టీ నుంచి వెళ్లిపోయింది.. టీచర్ తిట్టిందని కాలి నడకన ఇంటికి వచ్చింది.. శ్రుతి కోపంలో ఏమైనా చేసి ఉంటే.. పట్టించుకోకు.. కాస్త సర్దుకో అని శ్రుతి మదర్ అంటుంది. అలాంటిదేమీ జరగలేదు అని రవి కవర్ చేస్తుంటాడు.నిజం చెప్పి.. మరో వైపు శ్రుతి కోసం బాలు, మీనా డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే.. అక్కడ లాయర్ వద్దకు వెళ్లిందనే సమాచారం దొరుకుతుంది. ఏంటి విడాకులు తీసుకుంటుందా? అని బాలు, మీనా కంగారు పడతారు. వెంటనే ఆ లాయర్ ఆఫీస్‌కి వెళ్తారు బాలు, మీనా. అక్కడ శ్రుతి ఉంటుంది. నా ముందే నీతూని ఎత్తుకుంటాడా? పులిహోర కలుపుతాడని అనుకుంటే.. కిచెన్‌లో అనుకున్నా.. బాస్ కూతురితో అని నాకు ఇప్పుడే తెలిసిందంటూ శ్రుతి అనుకుంటుంది. ఇక బాలు, మీనాలని చూసి శ్రుతి షాక్ అవుతుంది. అసలు విషయం ఏంటో చెప్పి శ్రుతిని రియలైజ్ అయ్యేలా చేస్తారు.పాపం రవి.. అక్కడ ఏమీ జరగలేదు.. అంతా నువ్వే ఊహించుకున్నావ్ అని బాలు, మీనాలు నిజం చెప్పడంతో శ్రుతి బాధపడుతుంది. నా కోసం రవి కంగారు పడుతూ ఉంటాడేమో.. అయినా పర్లేదు ఇంకొద్ది సేపు ఇక్కడే ఉండి.. వాడ్ని కంగారు పడేలా చేద్దామని శ్రుతి అంటుంది. ఇంకొంచెం సేపు ఉంటే.. నీ ఫోటో పట్టుకుని రోడ్ల మీదకు వస్తాడు అని బాలు కామెడీ చేస్తాడు. నేనంటే వాడికి అంత ప్రేమనా? అని శ్రుతి అంటే.. చచ్చేంత ప్రేమ అని బాలు, మీనా అంటారు. సరే నేను బట్టలు కూడా టైలర్ దగ్గరే వదిలేసి వచ్చా అని శ్రుతి అంటుంది. అవి తీసుకునే ఫంక్షన్‌కి వెళ్దామని బాలు, మీనా అంటారు.ఏం జరిగింది.. ఇక డ్యాన్స్ చేసేందుకు ఎవ్వరూ లేరు అని సత్యం అంటాడు. అసలేం జరుగుతోంది రా.. బాలు, మీనా కూడా కనిపించడం లేదు అని సత్యం అనుమానిస్తాడు. ఏం జరగలేదు.. వస్తున్నారు అని రవి కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు. ఇంకెంత సేపు రా అని మనోజ్ అంటాడు. నేను పెద్ద బిజినెస్ మెన్ని నా కంటే బిజీనా అని మనోజ్ అంటాడు. ఉంటే ఉండు పోతే పో అని రవి అంటాడు. ఏంటి రవి అవమానిస్తున్నావా? అని రోహిణి అంటుంది. ఇంతలో శ్రుతి పేరెంట్స్ కూడా అడుగుతారు. అందరూ కలిసి ప్రశ్నలతో రవిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు.కలిసిపోయిన శ్రుతి, రవి బాలు, మీనా, శ్రుతి అందరూ కలిసి రావడంతో అంతా శాంతిస్తారు. డిజైనర్ దగ్గర ఉన్నాం. డ్రెస్ సరిగ్గా కుట్టలేదు అని శ్రుతి కవర్ చేస్తుంది. ఏరా లేచిపోయినోడా.. నీ గుండె ఆగిందా? అని రవికి కౌంటర్ వేస్తుంది శ్రుతి. అవునే డబ్బుడమ్మ రాక్షసి.. ఇంత వరకు అలానే ఆగింది అని రవి అంటాడు. నేను నీ బ్రహ్మ రాక్షసిని రా నేను ఎక్కడికి వెళ్తాను అని శ్రుతి అంటుంది. బాలు, మీనా వచ్చి చెప్పకపోయి ఉంటే.. అని శ్రుతి అంటుంది. ఇంతలో బాలు, మీనా, రోహిణి, ప్రభావతి వస్తారు. నా కాపురం నిలబెట్టారు అని బాలు, మీనాలకు రవి థాంక్స్ చెప్తాడు. శ్రుతి కాస్త చిన్న పిల్ల.. అవతలి వాళ్లతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు.. అని రవికి సలహా ఇస్తారు.అన్నావదినలను పొగిడిన రవి.. కేక్ కట్ చేసిన తరువాత బాలు, మీనాలకు తినిపిస్తారు రవి, శ్రుతి. మేం ఇలా సంతోషంగా ఉండటానికి కారణమే మా అన్నయ్య, వదిన అని రవి పొగిడేస్తారు. శ్రుతిది చిన్న పిల్లల మనస్తత్వం అప్పుడే అలుగుతుంది.. అప్పుడే మరిచిపోతుంది.. మా మధ్య దూరం పెంచాలని కొందరు ప్రయత్నిస్తే.. ఆ దూరాన్ని మా అనయ్య, వదినే తగ్గిస్తారు అని రవి అంటాడు. నేను అయితే మంచిదాన్ని కాదు.. మా అమ్మలోని అహంకారం, మా నాన్న గర్వం, మా అత్త చాదస్తం ఇవన్నీ నాలో ఉన్నాయి.. బాలు, మీనాలే నన్ను సరి చేస్తుంటారు.. భార్యాభర్తలు ఎలా ఉండాలో బాలు, మీనాలే తెలియజేశారు.. మేం ఇలా ఉన్నామంటే వాళ్లకే ఈ క్రెడిట్ అని శ్రుతి అంటుంది.బెస్ట్ కపుల్స్.. పెళ్లికి ముందు నాకు జాయింట్ ఫ్యామిలీ గురించి తెలీదు.. ఈ ఇంటికి వచ్చాక నాకు మీనానే సాయం చేసింది.. నిజంగా బాలు, మీనా బెస్ట్ కపుల్స్.. అని శ్రుతి అంటుంది. నిజానికి మా బాలుని చూసి రౌడీ అనుకున్నా.. కానీ మీనాని, బాలు ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.. రవి నన్ను చాలా భరించాడు.. నన్ను భరించినందుకు థాంక్స్.. నా ఫ్రీడంని ఎప్పుడూ తీసుకోలేదు.. అని అందరి ముందే ముద్దు పెట్టేస్తుంది శ్రుతి. మా ఇంట్లో బెస్ట్ ఎంటర్టైనర్ మా ఆంటీనే అని శ్రుతి కామెడీ చేస్తుంది. మా అంకుల్ ఉన్నారు కాబట్టే మేమంతా కలిసి ఉన్నాం.. నన్ను కూతురిలా చూసుకుంటాడు.. నేను ఏం అన్నా.. వెంటనే మర్చిపోతారు.. మనోజ్, రోహిణికి థాంక్స్ అని శ్రుతి అంటుంది. ఆ తరువాత ఆటపాటలతో ఈవెంట్ సాగుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : చెంపలు వాయించుకున్న కన్నా.. మహాలక్ష్మీ ఆఫీసులో చక్రి రౌడీయిజం.. సిగ్గుతో తలదించుకున్న మహా