
రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోతే.. గత ప్రభుత్వం వల్ల పూర్తిగా నష్టపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంస పాలన వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని తెలిపారు. తిరుపతి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ
.. ‘‘ ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను 53 రోజులు జైల్లో ఉంచారు. పవన్ కల్యాణ్‌ను అడుగడుగునా అడ్డుకొని వేధించారు. చీకటి పాలనకు చరమగీతం పాడాలనే కూటమిగా ఏర్పడ్డాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు ఇవాళ చూస్తున్నాం’’ అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలు చూస్తున్నాం: చంద్రబాబు |