
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఇక జీతం అనే మాట చిన్నదైపోయింది. అతను ఇప్పుడు సమయాన్ని శాసించే స్థాయిలో సంపాదిస్తున్నాడు. ఫుట్బాల్ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ
, కాలగణన అతని కోసం ప్రత్యేకంగా నడుస్తుంది. కేవలం 90 నిమిషాల ఆట అతనికి దాదాపు 30 కోట్ల రూపాయలు సంపాదించి పెడుతుంది. ఇదే మొత్తాన్ని ఏడాదికి 12 లక్షల రూపాయల జీతం తీసుకునే ఓ భారతీయ ఉద్యోగి సంపాదించాలంటే ఏకంగా 2,500 సంవత్సరాలు పడుతుంది. ఇది కేవలం జీతాల్లో వ్యత్యాసం కాదు, అదొక టైమ్ మెషిన్ లాంటిది.ఈ లెక్కలు ఎలా సాధ్యమో వివరంగా చూద్దాం. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఉన్న రొనాల్డో, సౌదీ అరేబియా క్లబ్తో చేసుకున్న ఒప్పందం ద్వారా ఏడాదికి సుమారు 200 మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నాడు. భారత కరెన్సీలో ఇది సుమారు 1,700 కోట్ల రూపాయలతో సమానం. ఒక ఫుట్బాల్ సీజన్లో క్లబ్, జాతీయ జట్టు తరఫున రొనాల్డో సగటున 55 మ్యాచ్లు ఆడతాడని అంచనా. ఈ లెక్కన అతని వార్షిక ఆదాయాన్ని మ్యాచ్ల సంఖ్యతో భాగిస్తే, ప్రతి మ్యాచ్కు అతని సంపాదన దాదాపు 30 కోట్ల రూపాయలని తేలుతుంది. అంటే.. 90 నిమిషాల ఆట, అదనపు సమయం కలిపి అతనికి వచ్చే ఆదాయం, మన దేశంలోని ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఏడాది జీతాల కోసం కేటాయించే బడ్జెట్తో సమానం.ఇది కేవలం అతని వార్షిక ఆదాయం మాత్రమే. ఇక అతని నికర ఆస్తి విలువ చూస్తే కళ్లు చెదరడం ఖాయం.