
Govt Petrol Diesel Purchase : పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ పరిణామం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపకుండా
ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యతను కాపాడేందుకు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కొత్త ఆంక్షలను విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య, సంస్థాగత అవసరాల కోసం భారీగా ఇంధనాన్ని వినియోగించే కస్టమర్లు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా కేంద్రం పూర్తిగా నిషేధం విధించింది. టెలికాం టవర్లు, విద్యుత్ ఉత్పత్తి మరియు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం ఇంధనం కావాల్సిన వారు కేవలం ‘బల్క్ అమ్మకపు కేంద్రాల’ (Bulk Supply Hubs) నుంచే ఇంధనాన్ని పొందాలని స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: CM Mohan Yadav: సొంత పార్టీ నేతలే మీనాక్షిని దెబ్బకొట్టారు.. మధ్యప్రదేశ్ సీఎం
సాధారణ ప్రజలకు, వాహనదారులకు ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్రం రిటైల్ అవుట్లెట్లకు కఠిన ఆదేశాలు ఇచ్చింది:ఇకపై ఏ పెట్రోల్ బంకులోనైనా సరే, ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్‌కు రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్/పెట్రోల్ నింపకూడదు.రిటైల్ బంకుల్లో కొనుగోలు చేసిన ఇంధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు పునర్విక్రయం (Resale) చేయకూడదు.
పశ్చిమాసియా సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOC, BPCL, HPCL) రిటైల్ ధరలను నియంత్రణలో ఉంచాయి. కానీ, బల్క్ సరఫరాదారుల వద్ద మాత్రం మార్కెట్ రేట్లను వసూలు చేస్తున్నారు. ధరల్లో దాదాపు రూ. 39 కి పైగా వ్యత్యాసం ఉండటంతో పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారులు బల్క్ సప్లయర్లను వదిలేసి, సాధారణ పెట్రోల్ బంకులను ఆశ్రయించారు. దీనివల్ల ప్రభుత్వ రంగ బంకుల్లో డీజిల్‌కు అసాధారణ డిమాండ్ పెరిగింది. మే నెలలోనే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లలో పెట్రోల్ అమ్మకాలు 4.8 శాతం, డీజిల్ అమ్మకాలు 6.4 శాతం మేర పెరిగాయి. దీనివల్ల ప్రైవేట్ బంకుల్లో అమ్మకాలు తగ్గి, ప్రభుత్వ బంకులపై తీవ్ర ఒత్తిడి పడింది. అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసులు, షిప్పింగ్ లాజిస్టిక్స్ దెబ్బతిన్న తరుణంలో దేశీయంగా ఇంధన నిల్వలు (Hoarding), బ్లాక్ మార్కెటింగ్, అనధికారిక సేకరణలు జరిగే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, కేంద్రం జారీ చేసిన నయా రూల్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, చమురు మళ్లింపులను నిరోధించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను (UTs) ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంధన సమాన లభ్యతను నిర్ధారించడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Tamil Nadu CM Vijay: నేడు కొల్లూరు మూకాంబికా ఆలయానికి తమిళనాడు సీఎం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Apple iphone 17 pro max discount: భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధరలు
AP medical recruitment: ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Meenakshi Natarajan’s Rajya Sabha nomination : రాజ్యసభ నామినేషన్ కేసు.. రేపటికి వాయిదా
DK Shivakumar: సీఎం అయ్యాక తొలిసారి ప్రధాని మోదీతో డీకే శివకుమార్ భేటీ
India A vs Afghanistan A: అఫ్గానిస్తాన్‌పై భారత బ్యాటర్ల విధ్వంసం.. 349 పరుగుల భారీ టార్గెట్!
Suicide Due in Loan Burden : లోన్ భారంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు