
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50వ వార్షిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఆసక్తికరమైన 'పికిల్‌బాల్ టోర్నమెంట్'ను నిర్వహిస్తోంది. ఈ క్రీడా పోటీలో కమ్యూనిటీలోని క్రీడా ప్రియులు అందరూ
పాల్గొని పోటీ పడే అవకాశం కల్పించారు. విభాగాలు.. ఈ టోర్నమెంట్లో మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ , మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. వినోదం, ఫిట్నెస్ , కమ్యూనిటీ కలయికగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. వివరాలు.. తేదీ: ఆగస్టు 7-8, 2026 వేదిక: ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్, 28505 సౌత్‌వెస్ట్ ఫ్రీవే, రోసెన్‌బర్గ్, TX 77471 ఆసక్తి గల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం tca50.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా coreteam@tca50.org కి ఈమెయిల్ చేయవచ్చు.