
BRS Activists | ఊట్కూర్, మే 30: నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు తూములను తెరిచి ఉంచడంతో విలువైన సాగునీరు వృథాగా పోతుందని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు శనివారం తహసిల్దార్ అశోక్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. చెరువులో నిల్వ ఉన్న నీరు రైతుల సాగుకు అత్యంత అవసరమని, తూములు తెరిచి ఉంచడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అక్రమంగా తూములు తెరిచిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే తూములను మూసివేసి సాగునీటిని సంరక్షించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మండల నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, తరుణ్, బలరాం, అంజి, ఉబేదుర్ రహిమాన్, షేక్ షమీ, హోటల్ ఖాలిక్, జమాల్, కొత్తపల్లి రమేష్, రైతులు పాల్గొన్నారు.
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్లు, సినిమాలివే! Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి? Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్జెండర్ ఇన్ఫ్లూయెన్సర్
# 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999
Website: +91-40-23291163 digitalsales@tppl.news
The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd