
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Star Hero:సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు దగ్గరైన లారెన్స్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఆయనే స్వయంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల విడుదల చేసిన ఒక వీడియోలో రాజకీయాలపై తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు.
“నాకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. కానీ మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. మీరు వద్దు అంటే నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా వంతు సేవను ఇలాగే కొనసాగిస్తాను. మీరు ఒకే అంటే రాజకీయాల్లోకి వస్తాను. మీ ఆశీర్వాదాలతో ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభిస్తానో త్వరలో చెబుతాను” అని లారెన్స్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమేనన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో లారెన్స్ చేరే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్‌తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి.
మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెడితే లారెన్స్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యే అవకాశముందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారని, ఆ తర్వాత ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారని సమాచారం.
తమిళనాడులో భవిష్యత్తులో జరిగే ఉప ఎన్నికల్లో కూడా లారెన్స్ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే నిర్ణయాన్ని లారెన్స్ తన అభిమానులకే వదిలేశారు. ఇప్పుడు ఆయన అభిమానులు ఎలాంటి స్పందన ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలన్నీ ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.