
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తమ 50వ వార్షిక స్వర్ణోత్సవ వేడుకలను (Golden Jubilee Celebrations) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా
, మీలోని గాత్ర , నృత్య ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి 'హ్యూస్టన్ ఐడల్' (Houston Idol) పోటీని నిర్వహిస్తున్నారు. ప్రతిభను ప్రదర్శించడం.. మీకు పాడటంలో అద్భుతమైన గళం ఉన్నా, లేదా నృత్యంలో ఆకట్టుకునే ప్రతిభ ఉన్నా, హ్యూస్టన్ ఐడల్ మీకు సరైన వేదిక. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ గాత్ర ప్రతిభను ప్రపంచానికి చాటవచ్చు. నృత్య ప్రదర్శనలతో స్టేజ్‌ను ఉర్రూతలూగించవచ్చు. ఈ పోటీలో పాల్గొని, మీ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. ఈవెంట్ వివరాలు.. వేదిక: ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్, 28505 సౌత్‌వెస్ట్ ఫ్రీవే, రోసెన్‌బర్గ్, TX 77471. తేదీలు: ఆగస్టు 7 , 8, 2026. రిజిస్ట్రేషన్ వివరాలు.. ప్రతిభావంతులైన కళాకారులు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం , తమ పేరును నమోదు చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ tca50.org ను సందర్శించవచ్చు.