సీఈవో కాలేదు అని రాజు బాధ పడుతుంటాడు. ఇక శేషు అయితే తన బాధను చెప్పుకుంటూ ఉంటారు. మామ, అల్లుళ్లు ఇద్దరూ కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. అల్లుడి బాధను తగ్గించే మందు నా దగ్గర ఉంది కదా.. అని శేషు తాను
తీసుకు వచ్చిన మందు బాటిల్‌ను చూపిస్తాడు. ఆహా.. మామ.. నువ్వు ఎంత మంచివాడివి.. నాకు ఇప్పటి వరకు ఉన్న బాధంతా పోయిందని అంటాడు రాజు. నీ బాధని ఎలా పోగొట్టాలో ఈ మామయ్యకి తెలుసు కదా అని శేషు అంటాడు. ఇద్దరూ కలిసి పెగ్గులు వేస్తుంటారు. ఇంకో వైపు తినడాకి ఇందు అన్నీ ప్రిపేర్ చేస్తుంది. అందరూ తినడానికి రండి అని పిలుస్తుంది ఇందు. తినడం తరువాత ముందు ఈ డాక్యుమెంట్ల మీద వేలి ముద్ర వేసి ఇవ్వు అని అంటుంది రేఖ. ఇక ఆ డాక్యుమెంట్లను పట్టుకుని ఇందు చదివేస్తుంటుంది. ఏం చేస్తున్నావ్.. ఏదో చదివేస్తున్నట్టుగా నటిస్తున్నావ్.. నీకు చదువు రాదు కదా.. ఏం చేస్తున్నావ్ అని భ్రమరాంబ అంటుంది. అవును నాకు చదువు రాదని వీళ్లంతా అనుకుంటారు.. కదా.. నేను కాస్త ఉంటే దొరికిపోయే దాన్ని అని ఇందు లోలోపల అనుకుంటుంది.చదివినట్టు యాక్ట్.. చదవాలి.. చదివినట్టు యాక్ట్ చేయాలి.. తను ఇప్పుడు సీఈవో.. కనీసం చదివినట్టు అయినా యాక్ట్ చేయకూడదా? అని తాగిన శేషు ఊగుతూ మాట్లాడతాడు. నేను నీకు ఉన్నాను అమ్మా.. ఈ బాబాయి ఉన్నాడు.. ముందు చదవడం ప్రాక్టీస్ చెయ్యి అని అంటాడు శేషు. అలా ఫాస్ట్ ఫాస్ట్ గా పేజీలు తిప్పకూడదు.. ఏదో చదివేస్తున్నట్టుగా మెల్లిగా పేపర్లు తిప్పుతూ యాక్ట్ చేయాలి అని శేషు చెబుతాడు. అలానే బాబాయ్ అని అంతా చదివేస్తుంది ఇందు. దాంట్లో ఉన్న మోసం గురించి ఇందుకి అర్థం అవుతుంది. దీంతో కంగారు పడుతుంది.శేషుకి అనుమానం.. ఇక ఇందులోని కంగారుని, భయాన్ని శేషు గమనిస్తున్నాడు. ఏమ్మా.. అందులో ఏమైనా తప్పు ఉందా? అలా కంగారు పడుతున్నావ్ అని శేషు అంటాడు. అవన్నీ ఇందుకి ఏం తెలుస్తాయి.. అని రేఖ, భూషణ్, భ్రమరాంబ అంటారు. అయినా అందులో ఏం ఉంటుంది.. మాకు ఇందు కంగారు పడుతున్నట్టుగా ఏమీ కనిపించడం లేదు కదా అని రేఖ అంటుంది. నాకు మాత్రం తేడాగా కొడుతోందని శేషు అంటాడు. ఇంతలో భ్రమరాంబ వాయిస్ పెంచి శేషు సైలెంట్ అయ్యేలా చేస్తుంది. ఇందు సంతకం పెట్టే వరకు ఏం మాట్లాడొద్దు అని బెదిరిస్తుంది.ఇరకాటంలో ఇందు.. ఎలా తప్పించుకోవాలా? అని ఇందు ఆలోచిస్తుంది. ఇంక్ ప్యాడ్ లేదు అని ఇందు అంటే.. నా దగ్గర ఉందని భ్రమరాంబ అంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా? అని ఇందు అనుకుంటుంది. ఇందుకి సమస్య వచ్చినట్టుందే అని అపర్ణ, సుభాష్ అనుకుంటారు. ఎందుకు మీ తాత, నానమ్మల వైపు చూస్తున్నావ్ అని రేఖ అడుగుతుంది. ఫస్ట్ డీల్ కదా.. సెంటిమెంట్ అని స్వాతి కవర్ చేస్తుంది. సరే వేలి ముద్ర వెయ్యి అని ఇందుని బలవంతం చేస్తుంటుంది రేఖ. ఇక చివరి నిమిషంలో వన్ సెకన్ అని రాజు ఎంట్రీ ఇస్తాడు.చిందులు వేసిన రాజు.. ఫుల్లుగా తాగి వచ్చిన రాజు ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు. పెద్ద పెద్ద సౌండ్లతో పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటాడు. ఏహె ఆపు చిరాగ్గా ఉందని ఐశ్వర్య అంటుంది. పాట ఆపు మామ అని రాజు అంటాడు. ఏంటి నీకు చిరాగ్గా ఉంది.. అసలు నీ మొహం చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది.. ఎప్పుడూ మూతి అలా ఇలా తిప్పుకుంటూ ఉంటావ్.. అని కౌంటర్ వేస్తాడు రాజు. నేను లేనప్పుడు నా భార్యతో వేలి ముద్ర తీసుకుంటారా? అని రాజు ఫైర్ అవుతాడు. నీకేం తెలుసు.. నువ్వుమైనా ఎప్పుడైనా సీఈవో కింద పని చేశావా? అని భ్రమరాంబ అంటుంది. ఇప్పుడు పని చేసి తెలుసుకుంటా.. నా భార్యతో పని చేస్తా అని ఇందుని లాక్కెళ్లి డ్యాన్స్ చేస్తాడు రాజు.రాజు, ఇందు స్టెప్పులు.. రాజు, ఇందు కలిసి స్టెప్పులు వేస్తారు. అదంతా చూసి రేఖకు కోపం వస్తుంది. ఆపండి అని రేఖ అంటుంది. నువ్వు లేకుండా వేలి ముద్ర వేయించుకుంటే తప్పేం ఉంది.. అని భూషణ్ అంటాడు. అది తెలుసుకుని నువ్వేమైనా లక్షలు సంపాదిస్తావా? అని ఫైర్ అవుతాడు. దీంతో భూషణ్‌కి కౌంటర్ వేసేలా ఓ పాట పెట్టు మామ అని శేషుకి రాజు ఆర్డర్ వేస్తాడు. దీంతో భూషణ్‌ను పట్టుకుని రాజు డ్యాన్స్ వేస్తాడు. రాజు, స్వాతి, శేషు అందరూ కలిసి స్టెప్పులు వేస్తారు. ఆపండి అని భ్రమరాంబ ఫైర్ అవుతుంది. చిల్లరవాడిలా ఈ గోల ఏంటి? అని రేఖ ఫైర్ అవుతుంది.రేఖకు స్వీట్ వార్నింగ్.. నీకు అసలేం కావాలి అని రేఖ అంటుంది. నాకు మర్యాద కావాలి అని రాజు అంటాడు. ఇందు సీఈవో.. సంతకంతో నీకేం పని అని రేఖ అంటుంది. భార్య సీఈవో అయితే భర్త కూడా సీఈవోనే కదా.. ఇది నేను చెక్ చేసిన తరువాతనే వేలి ముద్ర వేయిస్తా అని రాజు అంటాడు. ఆ డాక్యుమెంట్లు ఇవ్వు.. అని రేఖ చేయి ఎత్తుతుంది. పిన్ని.. అని రాజు వార్నింగ్ ఇస్తాడు. నా హ్యాండ్ పవర్ ఏంటో ఓసారి చెప్పు అత్త అని భ్రమరాంబని అంటాడు. దీంతో భ్రమరాంబ భయపడిపోతుంది. ఇక ఆ డాక్యుమెంట్లను రాజు చదివేస్తాడు. అమ్మో అని ఆశ్చర్యపోతాడు. ఎంత మోసం అని నిలదీస్తాడు రాజు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.