
ఇంటర్నెట్డెస్క్: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలలో కూడా
అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఉపచట్టాలను రూపొందించాలని యోచిస్తోంది.
15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో.. ముఖ్యంగా నివాస సముదాయాల్లో అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. అన్ని భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, అగ్నిమాపక నిరోధక పరికరాలు కచ్చితంగా ఉండాలని దిల్లీ ఫైర్ సర్వీస్ సిఫారసు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న భవనాల్లో ప్రాథమిక భద్రతా పరికరాల ఏర్పాటుకు ప్రణాళికలు సూచించినట్లు వెల్లడించారు. ఇటీవల మాలవీయనగర్, వివేక్ విహార్ వంటి పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
దిల్లీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుగ్లకాబాద్ ప్రాంతంలోని ఓ ఇంటి బేస్మెంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అక్కడే ఉన్న పలు వాహనాలకు అవి వ్యాపించగా.. పెద్దఎత్తున పేలుడు సంభవించింది. ఆ తర్వాత మొదటి, రెండో అంతస్తులకు కూడా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు మహిళలను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.