
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లో వస్తారని, ఎన్నికల్లో పోటీ చేయనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ
లారెన్స్ రాజకీయాల్లో వస్తారని, ఎన్నికల్లో పోటీ చేయనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై క్లారిటీ ఇస్తానని లారెన్స్ కూడా ప్రకటించారు. అయితే దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణించడంతో తన అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ వీడియో ద్వారా తెలిపారు. అందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే రాజకీయ ప్రయాణం ఆరంభిస్తానని, ప్రజలు సానుకూలంగా లేకపోతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ అన్నారు. తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీనితోపాటు ఇటీవల ఓ వేదికపై తమిళనాడు సీఎం విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లారెన్స్. చిత్రపరిశ్రమలో తనకు ఉన్న ఒకే ఒక్క ేస్నహితుడు విజయ్ మాత్రమేనని ఆయన వెల్లడించారు. ‘‘చిత్ర పరిశ్రమలో నాకు పెద్దగా ేస్నహితులు లేరు. ేస్నహితుడు అని చెప్పుకునే వ్యక్తి విజయ్ మాత్రమే! నా జీవితంలో మంచి చెడు ఏది జరిగినా మొట్టమొదట ఫోన్ చేసి విచారించేది ఆయనే. నాకు చిన్న గాయం తగిలినా ఎంతో ప్రేమతో ‘ఎన్న నన్బా.. ఎన్నాచ్చి’ అంటూ ఆప్యాయంగా అడుగుతారు’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే రాఘవ లారెన్స్ టీవీకే పార్టీలో చేరి తిరుచ్చి ఈస్ట్ బైపోల్లో పోటీ చేేస అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.