
ప్రపంచవ్యాప్తంగా 2026 ఫిఫా వరల్డ్ కప్ సందడి మొదలైన నేపథ్యంలో భారత ఫుట్‌బాల్ చరిత్రలోని ఒక కీలక ఘట్టం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అదే, 1950లో బ్రెజిల్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌కు భారత జట్టు అర్హత
సాధించినా, ఆ టోర్నమెంట్లో పాల్గొనలేకపోవడం. ఈ చారిత్రక తప్పిదం వల్ల, అప్పటి భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఎందరో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ప్రపంచ వేదికపై తమ సత్తా చాటే అవకాశాన్ని కోల్పోయారు.అప్రయత్నంగా వచ్చిన అర్హత... చేజేతులా వదులుకున్న వైనం1950 వరల్డ్ కప్‌కు ఆసియా నుంచి జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బర్మా వంటి దేశాలు రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల కారణంగా తప్పుకోవడంతో, భారత జట్టుకు అప్రయత్నంగా అర్హత లభించింది. స్వీడన్, ఇటలీ, పరాగ్వేలతో కూడిన గ్రూప్-3లో భారత్‌కు చోటు దక్కింది. ఆ సమయంలో పరాగ్వేపై భారత్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండటంతో తర్వాతి దశకు చేరుకునేందుకు మార్గం సుగమంగానే కనిపించింది.అయితే, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఈ అరుదైన ఆహ్వానాన్ని తిరస్కరించింది. ప్రయాణ ఖర్చులు, తగినంత సన్నద్ధత లేకపోవడం, జట్టు ఎంపికలో సమస్యలు, ఒలింపిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన వంటి కారణాలను చూపింది. ఆటగాళ్లు బూట్లు లేకుండా ఆడటం వల్లే వెళ్లలేదనే ప్రచారం ఉన్నప్పటికీ, అది ప్రధాన కారణం కాదని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. కెప్టెన్ సైలెన్ మన్నాతో సహా ఆటగాళ్లు బూట్లతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ, ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం మారలేదు. ఫిఫా ప్రయాణ ఖర్చుల్లో సింహభాగాన్ని భరిస్తామని