
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, పరిమితికి మించి షాపింగ్ చేసి, నెల చివరిలో వచ్చే భారీ బిల్లును ఒకేసారి కట్టలేక చాలామంది ప్రత్యామ్నాయంగా దానిని
ఈఎంఐ (EMI) లలోకి మార్చుకుంటారు. నెలవారీగా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది కదా అని పైకి ఇది చాలా సులభంగా, సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, దీని వెనుక వినియోగదారులకు తెలియకుండానే భారీ ఆర్థిక నష్టం దాగి ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చిన తక్షణం బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో అదనపు భారాన్ని విధిస్తాయి. అంతేకాకుండా, సాధారణ వ్యక్తిగత రుణాలతో (Personal Loans) పోలిస్తే క్రెడిట్ కార్డు ఈఎంఐలపై వడ్డీ రేట్లు అత్యధికంగా ఉంటాయి. దీనికి తోడు ప్రతి నెలవారీ వడ్డీపై జీఎస్టీ (GST) అదనంగా పడుతుంది. ఈ దాగివున్న ఛార్జీల వల్ల తెలియకుండానే వినియోగదారులు చాలా ఎక్కువ మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
Read Also : వరి సాగులో సరికొత్త విప్లవం – కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ
ఈఎంఐ సౌకర్యం వల్ల మనం కొనే వస్తువు అసలు ధర కంటే, మనం తిరిగి చెల్లించే మొత్తం (Total Repayment Burden) చాలా రెట్లు పెరిగిపోతుంది. ఉదాహరణకు, ఒకేసారి కట్టాల్సిన బిల్లును ఆరు నెలలకో, ఏడాదికో వాయిదాలుగా మార్చినప్పుడు.. అసలుతో పాటు వడ్డీ, చక్రవడ్డీ, ఇతర సేవా పన్నులు కలిసి తడిసిమోపెడవుతాయి. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా చేతిలో డబ్బులు ఉండి, ఈ అప్పును ఒకేసారి తీర్చేసి ఈఎంఐని క్లోజ్ చేద్దామనుకుంటే.. బ్యాంకులు ఊరకే వదిలిపెట్టవు. దానికి ‘ఫోర్ క్లోజర్ ఫీ’ (Foreclosure Charges) లేదా ముందస్తు ముగింపు రుసుము పేరిట పెనాల్టీలను విధిస్తాయి. దీనివల్ల వినియోగదారుడు తాను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బును బ్యాంకుకు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమవ్వడమే కాకుండా, క్రమంగా క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మనుషులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Nani : నిర్మాత గా మరో సినిమా చేయబోతున్న నాని !!
Honeytrap : హనీట్రాప్ కు బలైన లేడీ జడ్జి.. !
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Gold Rate Today: వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు
iPhone 17 Pro Max Discount: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’ విస్తరణ.. ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం
Mavilan : వరి సాగులో సరికొత్త విప్లవం – కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ
Zomato GST notice: ఏపీ ప్రభుత్వం జొమాటోకు రూ.9.63 కోట్ల ఫైన్!
Strait of Hormuz : అన్ని రకాల నౌకల ప్రయాణానికి పూర్తిగా మూసివేసిన ఇరాన్