నర్మద వేరు కాపురం పెట్టేసింది.. ఆ ధీరజ్ గాడేమో జైలు పాలు కావడంతో ప్రేమ ఏడ్చి ఏడ్చి చస్తుంది. కాబట్టి.. ఇక మన జోలికి వచ్చేదీ లేదూ.. నా కడుపు బాగోతం బయటపడేదీ లేదు అంటూ చంకలు గుద్దుకుంది శ్రీవల్లి
. అయితే గాల్లో ఎగిరిన దూది ఎక్కువ సేపు ఉండదన్నట్టుగా ఎగిరినట్టే ఎగిరి కిందపడింది. దాంతో ఆ తల్లీ కూతుళ్లు మరో కుట్రకి తెరతీశారు. ఈరోజు (జూన్ 12) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘ఛీ ఛీ నా ఆశలన్నీ తుస్సుమన్నాయి అంటూ తెగ ఫీల్ అయిపోతుంటుంది శ్రీవల్లి. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే.. నెక్స్ట్ ప్లాన్ సూపర్ హిట్ అవుతుందని పాజిటివ్‌గా తీసుకోవాలి అని అంటుంది సుకన్య. ఆ మాటతో భాగ్యం.. ఏంటే పాజిటివ్‌గా తీసుకునేదీ.. మమ్మల్ని వెళ్లి ఆ నర్మద, ప్రేమలకి హెల్పింగ్ చేయమని వెధవ సలహా ఇచ్చి చచ్చావ్.. కానీ క్రెడిట్ అంతా వాళ్లు కొట్టేసి మమ్మల్ని వెధవల్ని చేశారు’ అని అంటుంది భాగ్యం. మొత్తానికి నా ఆశలపై నీళ్ల చల్లారు అని అంటుంది శ్రీవల్లి. ఇందులో కూడా మనకి మంచే జరగబోతుంది అని అంటుంది సుకన్య. ఇంతలో పెద్దోడు చందు వచ్చి.. శ్రీవల్లి వైపు ప్రేమగా చూస్తాడు.ఇన్నాళ్లకి ఓ మంచి పని చేశారు.. మీకు కొంపలు కూల్చడం మాత్రమే తెలుసు అనుకున్నా.. కానీ ఇన్నాళ్లకి ఓ మంచి పని చేశారు.. ఆ దొంగను పట్టుకోవడంలో మీరు కూడా హెల్ప్ చేశారంట కదా.. అని అంటాడు చందు. మార్పు మంచిదే కదా.. మనిషులు మారతారు.. జీవితాంతం తప్పులు చేస్తూ ఉంటారా ఏంటీ.. వీళ్లలో కూడా మార్పు వచ్చేసింది.. వీళ్లని గుర్తించు బ్రూ.. క్షమించు బ్రూ.. వాళ్ల త్యాగాన్ని గుర్తించు బ్రో’ అని అంటుంది సుకన్య. అవును బావా ఆ యాక్షన్ సీన్ వల్ల మా అమ్మ నాన్నలకు నడుములు పనిచేయడం లేదు.. ఆ పడిపోయిన నడముతో ఇడ్లీలు అమ్ముకుంటే మంచం పట్టేస్తారు.. మనకి పుట్టబోయే బిడ్డ అమ్మమ్మ తాతయ్యని చూడకుండానే తీరం దాటేస్తారు. రేపటి నుంచి రైస్ మిల్లుకి రండి.. పడగొట్టేశారుగా వాళ్లు అలా తీరం దాటకుండా ఉండాలంటే.. నువ్వు మీ నాన్నని రైస్ మిల్లుకి తీసుకుని వెళ్లాలి అని మెలిక పెడుతుంది శ్రీవల్లి. ఇక భాగ్యం అందుకుని.. ‘చూడండి అల్లుడు గారూ.. మీ మామయ్య గారికి రైస్ మిల్లులో పని ఇచ్చి.. మేం ఓ ముద్ద తినడానికి పుణ్యం కట్టుకోండి అని ప్రాధేయపడుతుంది. శ్రీవల్లి అయితే.. ప్లీజ్ బావా అంటూ తెగ బ్రతిమిలాడేస్తుంది. దాంతో చందు కాదనలేకపోతాడు.. ఆకలికి ఇబ్బంది పడుతున్నారని జాలి పడి.. ఒప్పుకుంటున్నా.. ఒళ్లు దగ్గర పెట్టుకుని బుద్దిగా ఉండాలి.. అక్కడ ఏదైనా తేడా జరిగితే అస్సలు ఊరుకోను.. రేపటి నుంచి రైస్ మిల్లుకి రండి అని అభయం ఇస్తాడు చందు.కరెక్ట్ టైమ్‌కి మీరెలా వచ్చారు? ఇడ్లీ బాబాయ్ రైస్ మిల్లుకి వెళ్లడం కుట్ర ఉందని నాకు తెలుసు.. దాంతో ఈ దొంగల బ్యాచ్ అంతే ఆనందంతో గంతులు వేస్తుంటారు. ఇంతలో మన బిల్డప్ రాణి నర్మద ఎంట్రీ ఇస్తుంది. ‘నాకో డౌట్ వచ్చిందీ.. మేం ఆ రౌడీని పట్టుకోవడానికి అంత కష్టపడితే.. మీరు కరెక్ట్ టైమ్‌కి అక్కడికి ఎలా వచ్చారూ? అని అడుగుతుంది. దాంతో సుక్కూ.. ‘అంటే వాళ్లు అక్కడికి వస్తే మీకు హెల్ప్ అవుతుందనీ’.. అని అంటుంది. మీ డ్రామాలు నా దగ్గర కాదు.. ఇప్పుడు ఇడ్లీ బాబాయ్‌ని రైస్ మిల్లుకి పంపుతుండటం వెనుక కూడా ఏదో కుట్ర ఉండే ఉంటుంది.. మీరు ఎన్నిడ్రామాలు ఆడినా ఎవరు వదిలినా మిమ్మల్ని వదిలపెట్టే ప్రసక్తే లేదు.. అది గుర్తు పెట్టుకోండి’ అని హెచ్చరిస్తుంది నర్మద. దీనంతటికీ కారణం ప్రేమే.. ‘అంటే చంపేస్తారా ఏంటీ’?? ఇక భద్రావతి.. తనకి జరిగిన అవమానానికి రగిలిపోతుంది. ఇంట్లో ఉన్న సామాన్లను విసిరికొడుతుంది. ఆ పిల్ల బచ్చాగాడు నాకు వార్నింగ్‌లు ఇస్తాడా? అని భద్రావతి అంటే.. ‘దానికి కారణం మన ప్రేమే అక్కా.. ప్రేమే వాడ్ని రిలీజ్ చేయించింది’ అని అంటాడు సేనాపతి. ఆ రామరాజు గాడ్ని ఏం చేయాలేకపోయాం అంటే.. ఇప్పుడు వాడి కొడుకుని కూడా ఏం చేయలేకపోతున్నాం.. ఇంత డబ్బూ పలుకు బడి ఉండి.. ఆ కూలోడి కుటుంబాన్ని ఏం పీకలేకపోతున్నాం అని రగిలిపోతుంది భద్రావతి. దాని కారణం మన వాళ్లే అక్కా.. మన వాళ్లే మనకి శత్రువులు అవుతున్నారు. అప్పుడు వేదవతి.. ఇప్పుడు ప్రేమ. ఈ దెబ్బతో ఎలా కాపాడుకుంటారో చూస్తా.. మన వాళ్లపై పగ తీర్చుకోవడం కాదక్కా.. ఆ ధీరజ్ గాడితో వేరు చేయలేం అని మనకే వార్నింగ్ ఇచ్చింది అని అంటాడు సేనాపతి. ‘నాకు ఇప్పుడు అర్థం అయ్యిందిరా సేనా.. మనం గురి పెట్టాల్సింది ఆ ధీరజ్ గాడిపైనే. పెడతాను వాడిపై గురి పెడతాను. ఆ రామరాజు గాడు అన్నాడు కదా.. నా కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే కుటుంబం మొత్తం అడ్డుగా నిలబడి కాపాడుకుంటాం అని. ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బకి ఆ ధీరజ్ గాడ్ని ఎలా కాపాడుకుంటుందో చూద్దాం’ అని అంటుంది భద్రావతి. అటు ధీరజ్ని పోలీసులు కొట్టడంతో నొప్పులతో బాధపడుతుంటాడు. ఆ బీభత్సం తెలిస్తే ఇంకేమైపోతావో.. ఇంతలో ప్రేమ.. వేడినీళ్లు తీసుకుని వస్తుంది కాపడం పెట్టడానికి. ఇక ప్రేమ చేతికి ఉన్న గాయాన్ని చూసి ఎమోషనల్ అవుతాడు ధీరజ్. అలా ఒకరికొకరు ప్రేమని పంచుకుని ఆలస్యం చేయకుండా సాంగ్ వేసుకుంటారు. ఇంతలో నర్మద ఎంట్రీ ఇస్తుంది. నాన్నా ధీరజ్.. నువ్వు ఇంత చిన్నదెబ్బకే అల్లాడిపోతున్నావ్ కానీ.. నిన్ను అరెస్ట్ చేశారని ప్రేమ వాళ్ల పుట్టింటికి వెళ్లిన బీభత్సం తెలిస్తే ఇంకేమైపోతావో.. అని అంటుంది నర్మద. ఏం చేసిది వదినా అని ధీరజ్ అంటే.. జరిగింది మొత్తం పూస గుచ్చినట్టు చెప్తుంది నర్మద. ఆరోజు ప్రేమ ఏ రేంజ్లో యాక్ట్ చేసిందో చేసి మరీ చూపిస్తుంది నర్మద. నీ కోసం నా వాళ్లనే కాదు ఆ దేవుడ్ని అయినా ఎదురిస్తా.. ఒడియమ్మా పెర్ఫామెన్సో ఒక్క డైలాగ్ కూడా వదిలిపెట్టకుండా చెప్పిన ప్రేమ.. ‘చూశావా ధీరజ్.. నీ భార్యని నీపై ఎంత ప్రేమ ఉందో’ అని అంటుంది. ఏమే రాక్షసీ నా కోసం నీ వాళ్లని కొట్టడానికి వెళ్లావా? అని అడుగుతాడు. హా.. నా భర్తని బాధపెడితే.. నా వాళ్లని ఏంటీ.. ఆ దేవుడ్ని అయినా ఎదురిస్తాను’ అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్.. ప్రేమ చేతుల్ని ముద్దాడి ప్రేమ కురిపిస్తాడు. హలో బాబూ.. ఇక్కడ నేనొకదాన్ని ఉన్నాను.. నేను వెళ్లాక మీ రొమాన్స్‌లు చేసుకోండి’ అని పంచ్ వేస్తుంది నర్మద. ఇక నర్మద వెళ్లిపోయిన తరువాత వాళ్ల సాంగ్‌ని కంటిన్యూ చేస్తూ రొమాన్స్‌లో మునిగిపోతారు ధీరజ్, ప్రేమలు. నా బిడ్డ గుండె చప్పుడు వినిపించు అటు చందు రైస్ మిల్లుకి రెడీ అవుతుంటే శ్రీవల్లి వచ్చి.. దువ్వెన ఇటు ఇవ్వు బావా నేను దువ్వుతానంటూ తెగ దువ్వేస్తుంటుంది. ఇప్పుడు సూపర్ ఉన్నావ్ అంటూ మెల్లగా ముగ్గులోకి లాగుతుంటుంది. దాంతో చందు.. ఏంటీ తెగ ప్రేమ నటిస్తున్నావ్? అని అడుగుతాడు. ‘అయ్యో బావా.. భర్తకి భార్య సేవలు చేయడం ప్రేమే కదా.. నాటకం ఎలా అవుతుంది. పైగా ఈరోజు నుంచి మా నాన్నని రైస్ మిల్లుకి తీసుకుని వెళ్తున్నావ్ కదా.. అందుకే నీపై ఉన్న ప్రేమ రెట్టింపు అయ్యింది అని అంటుంది శ్రీవల్లి. హో.. సడెన్‌గా ఈ దువ్వుడు ప్రోగ్రామ్ ఇందుకా?? సర్ సర్లే నేను రైస్ మిల్లుకి వెళ్తానని అంటాడు చందు. వెళ్తూ వెళ్తూ.. చూడు వల్లీ.. నాకు మన బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఉంది అని అంటాడు. దెబ్బకి షేక్ అయ్యి షాక్ అయిపోతుంది శ్రీవల్లి. నా బిడ్డ గుండె చప్పుడు వింటానంటూ పొట్టదగ్గర చెవిపెడతాడు చందు. అప్పుడే నర్మద, ప్రేమలు ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరిగింది. అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.