మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ తన
విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే సినిమా సాధించిన విజయంతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాత్రపై, ఆమె తీసుకున్న పారితోషికంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.* అప్పలసూరి తమిళోడో.. మలయాళమోడో అయితే లేపేవారు.. తెలుగోడు కావడం మన కర్మ: జగపతిబాబు ఆవేదన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ' అచ్చియమ్మ ' అనే పాత్రను పోషించినందుకు గాను జాన్వీ కపూర్ ఏకంగా రూ. 8 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ చిత్రానికి ఆమె సుమారు రూ. 5 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ లెక్కన చూసుకుంటే, ఈ సినిమా కోసం ఆమె తన రెమ్యునరేషన్‌ను ఏకంగా 50 శాతం మేర పెంచేసి తన కెరీర్లోనే అత్యధిక మొత్తాన్ని వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కమర్షియల్‌గా సంచలన విజయం సాధించినప్పటికీ, కథలో జాన్వీ కపూర్ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ మొత్తం హీరో చుట్టూనే తిరగడంతో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కోసమే పరిమితం అయిందని, పాత్ర రూపకల్పన చాలా బలహీనంగా ఉందంటూ ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు సినిమాలో జాన్వీపై చిత్రీకరించిన కొన్ని అభ్యంతరకర, శృంగారభరితమైన సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ సీన్లను మేకర్స్ థియేటర్ల రన్ నుండి తొలగించాల్సి వచ్చింది. ఇంతటి భారీ పారితోషికం తీసుకుని, ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలో నటించడం అవసరమా అంటూ జాన్వీపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. * ‘కరుప్పు’ బ్లాక్‌బస్టర్‌తో జోరు పెంచిన సూర్య.. అనిల్ రావిపూడితో ల్యాండ్‌మార్క్ మూవీ? సినిమా విడుదలైన తర్వాత జరుగుతున్న ప్రమోషన్లలో కూడా జాన్వీ పెద్దగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాత్రకు వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వల్లే ఆమె ప్రచారానికి దూరంగా ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘దేవర’, ‘పెద్ది’ వంటి వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైనప్పటికీ నటిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక బలమైన ముద్ర వేయడంలో జాన్వీ వెనుకబడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమాలు ఏవీ లేకపోవడంతో, రాబోయే రోజుల్లో టాలీవుడ్లో ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.