
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు. కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికతో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తితిదే
ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖేశ్ అంబానీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అంబానీ కుటుంబానికి ఆశీర్వచనం చేయగా.. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వార్త చదివారా: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు