
(మెక్సికో ఆటగాళ్ల ప్రాక్టీస్ ఫొటో.. బాక్స్‌లో రిఫరీ) ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే సహ ఆతిథ్య జట్టు మెక్సికో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 2-0
తేడాతో మెక్సికో గెలిచింది. అయితే, ఇప్పుడు ఆ మ్యాచ్‌కు రిఫరీగా పనిచేసిన విల్టన్ సాంపియో హైలైట్‌గా నిలిచాడు. ఒకే మ్యాచ్‌లో మూడు రెడ్ కార్డులు ఇచ్చి వార్తల్లోకెక్కాడు. దక్షిణాఫ్రికా ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించిన విల్టన్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇవ్వాలని అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో అతడిపై మీమ్స్‌తో నెటిజన్లు విజృంభించారు. ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే ఇలాంటివి చూడాల్సి రావడం బాధాకరమని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ప్లేయర్లకు డైరెక్ట్ గా రెడ్‌కార్డు రావడంతో.. చాలా సమయంపాటు ఆ జట్టు తొమ్మిది మందితోనే ఆడాల్సి వచ్చింది.
గత ప్రపంచ కప్ (2022)లో టోర్నీ మొత్తం కేవలం నాలుగు రెడ్ కార్డులను మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ, ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే ఏకంగా మూడు రెడ్ కార్డులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఫిఫా ప్రపంచ కప్‌లో ఒకే మ్యాచ్‌లో ఇన్ని రెడ్ కార్డులు అదీనూ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇవ్వడం ఇదే తొలిసారి. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే రికార్డు నమోదైతే.. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డు ఇవ్వడం సహజమే. అయితే, రెండుసార్లు ఎల్లో కార్డులు ఇచ్చినా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అప్పుడు రెడ్ కార్డు చూపిస్తారు. దీంతో అప్పట్నుంచి మ్యాచ్ అయ్యేవరకూ సదరు ఆటగాడు డగౌట్‌కే పరిమితం కావాల్సిఉంటుంది. మరొకరిని బరిలోకి దించే అవకాశమూ ఉండదు. రెడ్ కార్డు ఎదుర్కొనే ప్లేయర్‌పై తర్వాత ఒక మ్యాచ్ నిషేధం విధించొచ్చు. అయితే, అది రిఫరీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. కానీ, మెక్సికో - దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మాత్రం ముగ్గురికీ ఒక్కసారి కూడా ఎల్లో కార్డు ఇవ్వకుండానే.. రెడ్ కార్డ్ చూపించడమే ఇప్పుడు విమర్శలకు దారితీసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్ సింగర్ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.