
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ఆషాడంలోగా పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇది ఎంతగానో ముఖ్యమైన వార్తగా చెప్పవచ్చు. ఎందుకంటే గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. తాజారేట్లను గమనించినట్లయితే నేడు జూన్ 12వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,866 పలుకుతుండగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,440 పలుకుతోంది. అలాగే ఒక కేజీ వెండి ధర రూ. 2,46,566 పలుకుతోంది.. ఇక బంగారం వెండి ధరలు తగ్గడానికి టెక్నికల్ అంశాల జోలికి వెళ్ళినట్లయితే... ప్రపంచవ్యాప్తంగా బంగారం వెండి లో పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడుల పైన లాభాలను స్వీకరిస్తున్నారు. అంటే మార్కెట్లో బంగారం వెండిని విక్రయించి తమ పెట్టుబడుల పైన లాభాలను పొందుతున్నారు అని అర్థం. ఈ కారణంగానే ఒకేసారి బంగారం వెండి తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక అంతర్జాతీయ పరంగా గమనించినట్లయితే, బంగారం సిల్వర్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలంగా పుంజుకోవడమే... సాధారణంగా అమెరికన్ డాలర్ విలువ పుంజుకుంటే బంగారం సిల్వర్ ధరలు తగ్గిపోతుంటాయి. అయితే చాలామందికి ఇది విచిత్రమైన అంశంగా అనిపించవచ్చు. అసలు డాలర్ కు బంగారానికి ఏంటి సంబంధం ఉంది. అయితే అసలు విషయం తెలుసుకుందాం... మరిన్ని వివరాల్లోకి వెళితే... నిజానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఫెడరల్ రిజర్వు అమెరికా ట్రెజరీ బాండ్ల పేరిట బాండ్లను విడుదల చేస్తుంది. . వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుంటారు. ఈ బాండ్ల పైన పెట్టుబడి పెట్టిన వారికి అమెరికా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఈ వడ్డీ అనేది డాలర్ పైన ఆధారపడి ఉంటుంది. డాలర్ విలువ పెరిగినట్లయితే బాండ్లపై వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది. అందుకే ఇన్వెస్టర్లు ఎక్కువగా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే అదే సమయంలో ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడుల్లో పెడుతుంటారు. గడచిన ఏడాదికాలంగా అమెరికా ట్రెజరీ బాండ్ల పైన వచ్చే రాబడి తగ్గడంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా బంగారం లోనే పెట్టుబడి పెట్టారు. దీంతో బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల విలువ కూడా పెరిగింది. దానిపై వస్తున్న వడ్డీ కూడా పెరగడంతో ప్రస్తుతం మళ్ళీ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన పెట్టుబడులపై లాభాల రూపంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఫలితంగా బంగారం ధరలు వెండి ధరలు తగ్గి వస్తున్నాయి.
వెండి ధర గడచిన నెల రోజుల్లో గమనించినట్లయితే దాదాపు 35 వేల రూపాయల వరకు తగ్గినట్లు చూడవచ్చు. ఎందుకంటే దాదాపు వెండి ధర 2.70 లక్షల రూపాయల నుంచి 2.35 లక్షల రూపాయలకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది కాస్త అనుకూలమైన సమయం గా ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.