
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్
Jun 12 2026 7:46 AM | Updated on Jun 12 2026 7:54 AM
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ప్రపంచ అవయవ ట్రాన్స్‌ప్లాంట్ డే వేడుకలను ఆయన బంజారాహిల్స్‌లోని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా ఆయన 1995లో అయవవ దానంతో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్ చట్టం తీసుకొచ్చిన నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ ఏఐఎస్ ఏపీవీఎన్ శర్మతో పాటు లివర్ దాతలను, కాలేయ గ్రహితలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయని 30 శాతం ఫ్యాటీ లివర్ కేసుల్లో మాత్రమే ఆల్కహాల్ వల్ల సంభవిస్తాయని 70 శాతం కేసుల్లో జన్యుపరంగా, డయాబెటిస్, ఒబేసిటి కారణాలు ఉంటాయని అన్నారు.
ఫ్యాటీ లివర్ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని లివర్ సిరోసిస్‌గా మారి వ్యాధి ముదిరితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అవయవ దానంపై ఎంతో అవగాహన పెరుగుతుందని ప్రతియేటా దేశంలో 2లక్షల మందికిపైగా అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారని అయవవ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సల్లో మన దేశంలో ప్రపంచంలోనే అయిదో స్థానంలో ఉందని ఆయన తెలిపారు.
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
సెకండ్ ర్యాంక్ వచ్చిన నాకు కాకుండా.. 5వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఎలా వచ్చింది?
కుక్కకు GPS ట్రాకర్.. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
మంత్రి మాట్లాడాల్సిన భాష అదా..? జగన్ ను కలిశాక మాతో చెప్పిన మాట
అమెరికా సంబంధమని ఆశపడితే అంతే సంగతి.. భారత మహిళ షాకింగ్ నిజాలు..