
Mahesh Babu About Karthi:దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు, కార్తీ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీ తన స్కూల్ రోజుల
జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తమిళ స్టార్ హీరో కార్తీ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పుడు మహేష్ బాబు తనతో ఎలా ఉండేవారో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదివారు. ఆ రోజుల్లో ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని ఆయన తెలిపారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో మహేష్ బాబు రాత్రి ఆలస్యంగా కూడా తనకు ఫోన్ చేసి మ్యాథ్స్ నోట్స్ అడిగేవాడని కార్తీ గుర్తు చేసుకున్నారు.
అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో రాత్రి 3 గంటల సమయంలో కూడా మహేష్ బాబు ఫోన్ చేసేవాడని చెప్పకొచ్చాడు. అయితే అన్ని గంటలకు ఫోన్ చేసి తనను మ్యాక్స్ నోట్స్ కోసం అడిగేవాడని కార్తీ సరదాగా చెప్పాడు. ఈ విషయాన్ని విన్న అభిమానులు ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హీరోలలో ఒకరు. ఆయన నటించిన పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. తన స్టైల్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ హీరో వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు.
మరోవైపు కార్తీ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోగా ఎదిగారు. పరుత్తివీరన్, ఖైదీ, ఊపిరి, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ వంటి చిత్రాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్లో, కార్తీ కోలీవుడ్‌లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఇద్దరూ తమ తమ భాషల్లో భారీ మార్కెట్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు పొందారు.