
కోటబొమ్మాళి: విశాఖ ఉక్కుపై మాజీ సీఎం జగన్, వైకాపా నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని తెదేపా కార్యాలయంలో
గురువారం ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును కాపాడేందుకు రూ.13 వేల కోట్ల ప్యాకేజీ మంజూరు చేయించామని గుర్తు చేశారు. పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. యూరియా అధిక వినియోగం ప్రమాదకరమని, ఈ ఏడాది నుంచి కొత్తగా యాప్ విధానం అమలు చేస్తున్నామన్నారు. దాని ద్వారా ఎంత యూరియా అవసరమనేది గుర్తించి ముందస్తుగానే స్లిప్ ఇస్తామని, ఎక్కడ కావాలంటే అక్కడ పొందవచ్చునన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విజయవాడలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయంగా మారాయి.
రేషన్ కార్డు కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఒక్కరోజులోనే పరిష్కారం చూపారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.