ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న ఇండియా-ఏ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం శ్రీలంకలోని డంబుల్లా వేదికగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు.. 4 పరుగుల తేడాతో (డక్ వర్త్
లూయిస్ ప్రకారం) పరాజయం పాలైంది. దీంతో ఈ సిరీస్‌లో తొలి ఓటమిని చవిచూసింది. గత మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక-ఏ జట్టుపై విజయం సాధించింది. ఈ ట్రై సిరీస్‌లో భారత్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి.డంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్-ఏ జట్టు ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో విఫలమైన యంగ్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో రాణించాడు. 22 బంతుల్లో 44 రన్స్ స్కోరు చేశాడు. అయితే మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 బంతుల్లో 84 రన్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66) హాఫ్ సెంచరీలు చేయడంతో భారత-ఏ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో(వర్షం కారణంగా కుదింపు) 349/9 పరుగులు చేసింది.అనంతరం వర్షం పడటంతో మ్యాచ్‌ను అంపైర్లు కుదించారు. అప్ఘానిస్థాన్-ఏ జట్టు లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294గా నిర్ధారించారు. అయితే ఛేజింగ్‌లో అప్ఘానిస్థాన్ జట్టు.. 25.5 ఓవర్లకు 177/2 పరుగులు చేసిన సమయంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. అప్పటికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం అప్ఘాన్.. 4 పరుగులు ఎక్కువే చేసింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు అప్ఘానిస్థాన్.. 4 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఆ జట్టు బ్యాటర్లలో ఇమ్రాన్ 75 నాటౌట్, బహీర్ షా 51 నాటౌట్ రాణించారు.ఈ ఫలితంతో ట్రై సిరీస్ పాయింట్స్ టేబుల్లో అప్ఘాన్ అగ్రస్థానానికి చేరింది. భారత్.. రెండో ప్లేసులో ఉంది. భారత్ చేతిలో ఓడిన శ్రీలంక మూడో ప్లేసులో ఉంది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో జన్ 15న శ్రీలంక-ఏతో తలపడనుంది. ఆపై అఫ్ఘాన్-ఏతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.