
ఎప్పుడూ మొక్కలు, రెండు కుర్చీలు కాకుండా బాల్కనీని ఈ రాజస్థానీ బోహో స్టైల్లో అలంకరించండి. అద్దాల మెరుపులతో రంగురంగుల కుషన్లు వేయండి. ఇత్తడి లాంతర్ల పెడితే వావ్ అనిపిస్తుంది. పరుపులు, రంగురంగుల
దిండ్లు, ఒక చిన్న టేబుల్, ఫెయిరీ లైట్లతో మీ బాల్కనీలో ఫ్లోర్ సీటింగ్ బోహో కార్నర్‌ను రెడీ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడానికి ఇది సూపర్ ప్లేస్.
లాంప్స్, వెదురు అలంకరణ వస్తువులతో మీ బాల్కనీకి మొరాకన్-ఇండియన్ ఫ్యూజన్ లుక్ ఇవ్వొచ్చు. ఇవి చూడటానికి చాలా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
మట్టి కుండీలు, వార్లీ ఆర్ట్, తీగ జాతి మొక్కలు, విండ్ చైమ్స్ వంటి వాటితో బాల్కనీకి టెర్రకోట, ఎత్నిక్ డెకర్ లుక్ ఇవ్వండి. ఇది చాలా సహజంగా కనిపిస్తుంది.
తెల్లటి ఉయ్యాల, పచ్చని మొక్కలు, హ్యాంగింగ్ లాంప్స్‌తో బాల్కనీకి వైబ్రెంట్ ఇండియన్ ఫెస్టివ్ లుక్ తీసుకురండి. పండగ రోజుల్లో ఇది అదిరిపోతుంది.
బాల్కనీలో కేవలం రంగురంగుల సోఫా కవర్లే కాదు, బోహో లుక్ కోసం మంచి కార్పెట్‌ను కూడా వాడొచ్చు. దీనితో పాటు కలర్‌ఫుల్ మొక్కలను కూడా జతచేయండి.
Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు
Plants: ఈ మొక్కలు కిచెన్ లో పెడితే.. దుర్వాసన అనేదే ఉండదు..!