
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల (IPASE) 2026 ఫలితాలను విడుదల
చేసింది. మే 13 నుంచి మే 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను ఆన్లైన్లో చూసుకోవచ్చు.ప్రధాన పరీక్షల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం బోర్డు ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది. జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫలితాలు చెక్ చేసుకునే విధానం:ముందుగా అధికారిక వెబ్సైట్లయిన tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in సందర్శించాలి.హోమ్‌పేజీలో కనిపించే 'IPASE 2026 Result' లింక్‌పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.జనరల్ లేదా ఒకేషనల్ స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకుని, మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.'Submit' బటన్‌పై క్లిక్ చేయగానే మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.భవిష్యత్ అవసరాల కోసం ఈ మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం మంచిది.