
ఇంటర్నెట్డెస్క్: ‘కడలిని శ్వాసించేవాడు వేరు. ఆ కడలినే శాసించేవాడు వేరు’ అంటున్నారు విశాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 35వ చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి
అరసు దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో విశాల్ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. మరి వాటి కథేంటి? త్రిపాత్రాభినయమా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఆ సంస్థకు ఇది 99వ చిత్రం. ఈ వార్త చదివారా: రెండు ఓటీటీల్లో ‘రమణి కల్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?