
ఢిల్లీ వేదికగా జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ 'వికసిత భారత్
@2047' లక్ష్యానికి అనుగుణంగా 'స్వర్ణాంధ్ర @2047' విజన్‌ను ఆయన సభ్యుల ముందుంచారు. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని సంపన్న, సమ్మిళిత, ప్రపంచ పోటీతత్వ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.మానవ వనరుల ఆధారిత అభివృద్ధి నమూనాను అమలు చేస్తామని చంద్రబాబు వివరించారు. దీని ద్వారా సంపూర్ణ పేదరిక నిర్మూలన, భారీ ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, జల, ఇంధన భద్రత కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. వ్యవసాయ-టెక్, లాజిస్టిక్స్, డీప్-టెక్ వంటి రంగాలను అనుసంధానిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తామని అన్నారు. పాలనలో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణలు, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు, 'అవేర్' (AWARE) వంటి ముందస్తు అంచనా సాధనాలను వినియోగిస్తున్నామని, ఇవి మెరుగైన పౌర సేవలకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణం కారణంగా గత రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌కు రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి సభకు తెలియజేశారు. దీనివల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక వృద్ధికి మార్గం సుగమమైందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ కోసం అనారోగ్యకరమైన పోటీ తగదని హితవు పలికారు. కేవలం ప్రోత్సాహకాలపై ఆధారపడకుండా మౌలిక