
దేశంలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వాహనాలు పరస్పరం సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పించే వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్
టెక్నాలజీకి సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ సాంకేతికత ద్వారా కార్లు, ట్రక్కులు మరియు ద్విచక్ర వాహనాలు తమ వేగం, దిశ, బ్రేకింగ్ వంటి అత్యవసర సమాచారాన్ని సమీపంలోని ఇతర వాహనాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తాయి.మే 7న జరిగిన సీఎంవీఆర్ టెక్నికల్ స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ముసాయిదాను రూపొందించారు. దీనిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలు జూన్ 20లోగా తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు. ఈ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్పై ఆధారపడకుండా, ప్రత్యేకమైన షార్ట్-రేంజ్ రేడియో ఫ్రీక్వెన్సీ (5,875–5,905 MHz బ్యాండ్) ద్వారా పనిచేస్తుంది. దీనివల్ల ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేసినా లేదా మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోయినా, డ్రైవర్ను ఈ వ్యవస్థ ముందే అప్రమత్తం చేస్తుంది.ఈ వ్యవస్థలో కచ్చితమైన లొకేషన్ గుర్తింపు కోసం భారతీయ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' తో పాటు జీపీఎస్, గగన్ సాంకేతికతలను వినియోగిస్తారు. దీనిద్వారా సెకనుకు 10 సార్లు వాహన సమాచారాన్ని అప్డేట్ చేసే వీలుంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సాంకేతికతను ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు. దీని సహాయంతో రోడ్డు ప్రమాదాలను 80 శాతం వరకు నివారించవచ్చని ఆయన అంచనా వేశారు.2026 చివరి నాటికి కొత్తగా తయారయ్యే వాహనాల్లో ఈ టెక్నాలజీని తప్పనిసరి చేయాలని