
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది. తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్
Jun 11 2026 6:10 PM | Updated on Jun 11 2026 6:21 PM
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది.
తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్ జరుగగా.. భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్‌తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి అదరగొట్టాడరు. ప్రభ్‌సిమ్రన్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.
మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇక వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం అఫ్గన్ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అఫ్గన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..
ఆఫీసులన్నీ క్లోజ్, నందుస్ భార్యాభర్తలు ఎక్కడ?
మా సపోర్ట్ వల్లనే గెలిచారు మాట మీద నిలబడకపోతే... బాబు ప్రభుత్వంపై ఉద్యోగులు ఫైర్