
‘పెద్ది’లో తాను పోషించిన ‘అప్పలసూరి’ పాత్రకు ఆశించిన ఆదరణ దక్కలేదని నటుడు జగపతిబాబు (Jagapathi Babu) అన్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో ఆయన ప్రత్యేక చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘ప్రస్తుత కాలంలో సినిమా
గెలిచాక కూడా పోరాడాల్సి వస్తుంది. ‘పెద్ది’ని కొందరు కావాలని నెగటివ్‌గా ప్రచారం చేశారని అర్థమైంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా బాగుందని చెబుతున్నారు. ఒక దర్శకుడు నాకు ఫోన్ చేసి ‘ఇదేం కర్మ అప్పలసూరి క్యారెక్టర్ తమిళ నటుడో, బాలీవుడ్ యాక్టరో చేసుంటే మనవాళ్లు పైకి లేపేవారు. మీరు తెలుగువారు అయిపోయారు మీ బ్యాడ్‌లక్’ అని నాతో అన్నారు’’ అని జగపతిబాబు తెలిపారు. ఈ వార్త చదివారా: ‘ధురంధర్’లో ఆ అంశాలు నచ్చాయి: పవన్ కల్యాణ్ ప్రశంసలు