
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
India Condemns US Attack News: పశ్చిమాసియాలోని ఒమన్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన ఘోర దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారతదేశం తీవ్రంగా ఖండించింది.
అసలేం జరిగింది? యూఎస్ సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. ఒమన్ తీరంలో ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తున్న పలావు జెండా కలిగిన 'MT సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న దిగ్బంధనం నేపథ్యంలో, యూఎస్ దళాలు పదేపదే ఇచ్చిన ఆదేశాలను, హెచ్చరికలను ఆ ఓడ పెడచెవిన పెట్టడంతోనే ఈ దాడి చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం వాదిస్తోంది.ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు.
ఈ దాడిలో మొదట గల్లంతైనట్లు భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు. ఇది అత్యంత 'విషాదకరమైన' నష్టమని ఆయన పేర్కొన్నారు. మరణించిన నావికులను క్రింది విధంగా గుర్తించారు. ఆదిత్య శర్మ (డెక్ క్యాడెట్), శివానంద్ చౌరాసియా (ఇంజన్ ఫిట్టర్), పట్నాల సురేష్ (చీఫ్ ఇంజనీర్) మిగిలిన 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించి తరలించారు.
అమెరికాపై భారత్ తీవ్ర ఆగ్రహం.. ఈ ఘోర దాడిపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని యూఎస్ ఛార్జ్ డి అఫైర్స్ (CDA)ను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించి, గట్టిగా నిరసన తెలియజేస్తూ 'డిమార్చే' జారీ చేసింది.
"మేము మా నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తాము. ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ పౌరులను కోల్పోవడం అత్యంత బాధాకరం. మా తీవ్ర నిరసనను అమెరికా గమనిస్తుందని ఆశిస్తున్నాము. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు ఆగిపోవాలి. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి, స్థిరత్వం సాధ్యమవుతాయి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8 (సోమవారం) నుండి భారతీయ నావికులున్న మూడు నౌకలపై దాడులు లేదా ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన 13 నౌకలు ఉన్నాయని, వాటిలో 562 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని ముఖేష్ మంగళ్ వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల కారణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న భారతీయ పౌరుల భద్రత ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.