
హైదరాబాద్: గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో అవతారమెత్తిందని సీపీ సజ్జనర్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు రూ.5వేల కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేసినట్లు ఆయన
వెల్లడించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ గత 25 ఏళ్లుగా ‘గోల్డ్ క్వెస్ట్’, ‘క్వెస్ట్ నెట్’ ‘క్యూనెట్’.. ప్రస్తుతం ‘ఇగ్నైట్’గా పేరు మార్చుకుని అమాయకులను దోచుకుందని సీపీ వివరించారు. దేశంలో లక్షల్లో బాధితులున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు చనిపోయిన ఘటనపై సీసీ సజ్జనర్ స్పందించారు. బాలికల అంతర్గత అవయవాల నమూనాలు భద్రపరచాలని ఆదేశించామని.. వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలికల మరణాలకు కారణాలు కనుగొంటామన్నారు. నారాయణగూడ పీఎస్ పరిధి విఠల్‌వాడిలో ఇద్దరు బాలికలు మృతిచెందిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఖమ్మంలో కీచకుడి దాడిలో తీవ్ర గాయాలపాలై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.