
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొనడంతో రోజంతా సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు
సూచీలపై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 150.63 పాయింట్ల నష్టంతో 73,832.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 53.35 పాయింట్ల నష్టంతో 23,161.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75గా ఉంది.
సెన్సెక్స్ ఉదయం 73,615.99 పాయింట్ల వద్ద (క్రితం ముంగింపు 73,983.18) నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం కాసేపు లాభాల్లోకి వెళ్లింది. ఆ సమయంలో 74,394.34 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకుని 73,832.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 4092 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.