
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Python Kiss Gone Wrong Viral Video Watch Now: నేటి డిజిటల్ యుగంలో లైకులతో పాటు వ్యూస్ కోసం యువత ఎలాంటి సాహసాలకైనా వెనక అడుగు వేయడం లేదు.. కొంతమంది కొన్ని సందర్భాల్లో పిచ్చి చేష్టలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఒక యువతి అత్యంత ప్రమాదకరమైన పాముతో పరాచకాలు ఆడబోయి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..? వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువతి చేతిలో అత్యంత పొడవైన ప్రమాదకరమైన పామును పట్టుకుని కనిపిస్తుంది. సాధారణంగా పాములను చూస్తేనే ఆమడదూరం పరుగెత్తే.. ఈ రోజుల్లో.. ఆమె మాత్రం దాన్ని చాలా సాధారణంగా చేతితో పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కెమెరా వైపు చూస్తూ.. ఆ పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె తన ముఖాన్ని పాము నోటి దగ్గరకు తీసుకుని రావడంతో.. ఆ మరుక్షణమే ఊహించని ప్రమాదం జరిగింది.
యువతి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పాము.. క్షణాల వ్యవధిలో మెరుపు వేగంతో ఆమె ముఖంపై దాడి చేసింది.. నేరుగా ఆమె ముక్కు భాగాన్ని నోటితో గట్టిగా కరిచేసింది.. ఊహించని ఈ దాడితో సదరు యువతి త్రీవ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిలలాడుతూ.. ఆ పామును అక్కడే విసిరేసి.. ముక్కు పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీయడం మీరు క్లియర్‌గా వీడియోలో చూడొచ్చు.
నెటిజన్ల ఆగ్రహం.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో అప్లోడ్ అయిన కొద్ధిరోజులకే లక్షలాది వ్యూస్‌తో పాటు వేలాది కామెంట్లతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇది కేవలం పిచ్చితనమే.. ప్రమాదకరమైన పాములతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడొద్దని.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తూ వస్తున్నాయి. అలాగే లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.. అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఆ పాము విషపూరితమైనది కాకపోవడం వల్లే ఆమె బతికిపోయి ఉంటుందని.. లేకపోతే.. ప్రాణాలు పోయేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.