
ఇంటర్నెట్ డెస్క్: పీవీ సింధు భర్త వెంకట దత్తసాయి కాసేపు కోచ్‌గా మారారు. వృత్తిరీత్యా ఆయన స్పోర్ట్స్ డేటా సైంటిస్ట్. కానీ, సింధు కోసం కొద్దిసేపు కోచ్‌గా మారి తన భార్యకు మనోధైర్యం కల్పించారు. ఇదే
మాటను పీవీ సింధు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఆమె రెండో రౌండ్లో మరో భారత షట్లర్ ఇషారాణి బారువాపై 22-20, 21-12 తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని సింధు తెలియజేసింది.
‘‘నాకు ఉదయం నుంచి ఒంట్లో అంతగా బాగోలేదు. నొప్పితో బాధపడుతున్నా. ఆ సమయంలో భావోద్వేగమైన మద్దతు అవసరం అనిపించింది. నాకు తెలిసిన వారిలో అత్యంత గొప్ప ఎనలిస్ట్ను పిలిచాను. మా ఇద్దరికి ఒకరే కోచ్. నేను కోచ్‌ను పిలిచి ఇషాను ఇబ్బందిపెట్టాలని అనుకోలేదు. దీంతో నా భర్త దత్తసాయికి ప్రమోషన్ ఇచ్చి.. ఆయనను కోచ్‌గా పరిచయం చేశా. నిజం చెప్పాలంటే.. నాకు వద్దు బాబోయ్ అనేంతగా బాగా ప్రోత్సహించారు (నవ్వుతున్న ఎమోజీలు). అయితే, రిఫరీ నుంచి రెండు వార్నింగ్‌లు అందుకొన్నా. కార్డు లేకుండానే ఎలాగోలా దీన్నుంచి బయటపడ్డాం. రెండో గేమ్ నాటికి ఇషాను సరిగ్గా అంచనా వేయగలిగా. భర్త క్రీడాభిమాని అయితే.. కొన్నిసార్లు ఎంతగానో సాయపడుతుంది’’ అని పీవీ సింధు పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.