
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
YS Jagan Mohan Reddy Sesantional Comments on AP Government: DSC ఎగ్జామ్ విషయంలో తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా, చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి లక్షలమంది అభ్యర్ధుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ముచేసిందన్నారు. స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిందని దుయ్య బట్టారు. . ఇంత ఘోరంగా DSC రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు.
డీఎస్సీ అంటే లక్షలమంది యువత ఆశ. వారి భవిష్యత్తుకు ఆశాదీపం. అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డం అత్యంత దారుణమైన విషయం అన్నారు. అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తుయన్నారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే 5తొలి సంతకాలు అంటూ నానా ఆర్భాటం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదికూడా పెద్ద మోసమే అన్నారు. దీంట్లో మెగాD SC అనేది ఒక సంతకం. వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం Notification ఇచ్చామన్నారు. వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న ఆ 16వేల పోస్టులకే మెగా పేరు పెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారు. ఇదీ చంద్రబాబు మొదటి సంతకం పరిస్థితి అన్నారు.
మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఆ 6,100 పోస్టులను కలుపుకుని, ఇప్పుడు మీరు నోటిఫై చేసిన ఈ 16వేల పోస్టులకే మెగా డీఎస్సీ అని పేరుపెట్టి, అది రికార్డు అని చంద్రబాబుగారు ఒకటే డబ్బా కొడుతున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అన్నారు. రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్‌తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే, అది YSRCP ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని రికార్డు అన్నారు.
మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ Next యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఈ రోజు ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.