
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Honor X80 Pro Max with 11,000mAh Battery: ప్రస్తుతం వస్తున్న అన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌లో బ్యాటరీ లైఫ్ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. రోజుకు రెండుసార్లు ఛార్జింగ్ పెట్టుకునే రోజులకు చెక్ పెడుతూ.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Honor సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. హానర్ సంస్థ తన పాపులర్ ఎక్స్-సిరీస్‌లో అత్యంత పవర్ఫుల్ మోడల్ Honor X80 Pro Maxను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఏకంగా 11,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు ఫిక్స్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్‌మీతో పాటు షియోమి, హువావే వంటి దిగ్గజ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో గరిష్టంగా 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలతో మాత్రమే విడుదల చేశాయి. కానీ హానర్ X80 ప్రో మాక్స్ వీటన్నింటికీ రెట్టింపు పవర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ను సాధారణగా వినియోగిస్తే దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. అలాగే ఇంత పెద్ద బ్యాటరీని సులభంగా ఛార్జ్ చేసేందుకు ఎంతో అద్భుతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ అద్భుతమైన బ్యాటరీ కేవలం గంటన్నర లోపే ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
అద్భుతమైన డిస్ప్లే.. కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా... ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ల్పే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ హానర్ X80 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.8 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఇది 2788×1280 పిక్సెల్స్ (1.5K) రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు క్లియర్‌గా చెబుతున్నాయి. ఇది చాలా తక్కువ బెజెల్స్ (Narrow Bezels)తో పాటు గుండ్రటి మూలలతో (Rounded Corners) ఈ ఫోన్ ప్రీమియం ల్యాండ్‌స్కేప్ లుక్‌ను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన ఫోటోలు చెబుతున్నాయి.
పవర్ఫుల్ ప్రాసెసర్.. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ వేగంగా ఉండేందుకు కంపెనీ ఇందులో ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ సంస్థకు చెందిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 (Snapdragon 6 Gen 5) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 4nm ఆర్కిటెక్చర్‌పై పని చేస్తుంది. కాబట్టి గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా సూట్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాటర్ రెసిస్టెన్స్, కింద పడినా పగలకుండా ఉండేందుకు ఇందులో కంపెనీ.. కంపెనీ డ్రాప్-రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా అద్బుతమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది.
మార్కెట్లోకి విడుదల అప్పుడే? ఈ హానర్‌కు సంబంధించిన బేస్ వేరియంట్ హానర్ X80 స్మార్ట్‌ఫోన్ 10,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ జూన్ చివరి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి. ఈ మొబైల్ సిరీస్‌కి సంబంధించిన ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉందని.. దీనిని త్వరలోనే కంపెనీ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయితే, మొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.