
తాజాగా నెట్టింట వైరలవుతున్న ఫోటోలలో భాగ్యశ్రీ లంగా ఓణీలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా మెరిసిపోతోంది. ఆమె నవ్వు, హావభావాలు అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు
పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, టాలీవుడ్లో మాస్ మహారాజా రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ సినిమాలో కేవలం నటనతోనే కాకుండా, తన గ్లామర్ , డ్యాన్స్ స్టెప్పులతో మొదటి సినిమాతోనే టాలీవుడ్ క్రష్‌గా మారిపోయింది. లేటేస్ట్ ఫోటలలో అందం, స్మైల్ తో కవ్విస్తుంది. కేవలం మోడరన్ దుస్తుల్లోనే కాదు, హాఫ్ శారీ , పట్టుచీరల వంటి సాంప్రదాయ దుస్తులలో కూడా మరింత అందంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తూ సోషల్ మీడియాలో అలరిస్తుంది ఈ అమ్మడు. ఈ ఫొటోలలో భాగ్యశ్రీ కళ్లలో ఉన్న మెరుపు, ఆమె ధరించిన ఆభరణాలు, దుస్తుల డిజైన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. యువ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్