
గతంలో ఎస్ఐఆర్ (SIR) నిర్వహించినప్పుడు బీజేపీ (BJP) మద్దతిచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు బీజేపీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్
రావు (Ramachander Rao) విమర్శించారు. సిద్దిపేటలో రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కేరళ ( Kerala), కర్ణాటక (Karnataka), తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రాంతంలోనే ఓటు వినియోగించేందుకు వీలు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుండటంతో ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులు, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలను మోసం చేశాయని ఆరోపించారు.