
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh News) ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసుల సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోదాల్లో భాగంగా దాదాపు రూ.11 కోట్ల విలువైన
అక్రమ ఆస్తులు గుర్తించారు. అయితే, వీటికి సంబంధించి ఉద్యోగి ఇచ్చిన సమాధానంతో దర్యాప్తు అధికారులు కంగుతిన్నారు. తన భార్య కుట్టు మిషన్, అల్లికలు చేస్తూ సంపాదించినవని చెప్పడం గమనార్హం.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీనారాయణ్ కండ్వాల్పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందౌర్‌లోని ఆయన నివాసంలో లోకాయుక్త పోలీసులు బుధవారం సోదాలు (Lokayukta Raids) చేపట్టారు. ఆయన జీతభత్యాలు, వ్యవసాయ వనరుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం కలిపి రూ.2.8 కోట్లుగా అంచనా వేశారు. కానీ, సోదాల్లో మాత్రం ఆయనకు మొత్తం రూ.10.83 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కగట్టారు.
మాతో ఉంటారా..? అభిషేక్ వెంటనా..?: దీదీకి కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం
ఈ అక్రమ ఆస్తులపై లక్ష్మీనారాయణ్‌ను అధికారులు ప్రశ్నించగా.. తన భార్య కుట్టు మిషన్, అల్లికల పని ద్వారా డబ్బు సంపాదిస్తోందని చెప్పడం గమనార్హం. కండ్వాల్ కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశామని, బ్యాంకుల నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత ఆయన మొత్తం ఆస్తులపై పూర్తి స్థాయిలో అంచనాకు వస్తామన్నారు. ఇదిలాఉంటే, మరో ఆరు నెలల్లో కండ్వాల్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.