
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులు జరిపింది. ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వేలాది మంది పౌరులు ఈద్గా మైదానంలో శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఈక్రమంలో పాక్ సైన్యం వీరిపై
కాల్పులు జరపడంతో 16 మంది మృతి చెందారు. రెండు రోజుల క్రితం కూడా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో మొత్తం 30 మందికి పైగా చనిపోయారు. పౌరులపై పాక్ సైన్యం కాల్పులు.. 16మంది మృతి |