
ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)కి భారీ హిట్ దక్కింది. అయినా ఆమెకి తెలుగులో ఇంకో పెద్ద ఆఫర్ రాలేదు. అందుకే కాబోలు ఇప్పుడు ఈ భామ స్టయిలింగ్ పై దృష్టి పెట్టింది. ఐశ్వర్య రాజేష్ కెరీర్లో అతిపెద్ద హిట్
ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)కి భారీ హిట్ దక్కింది. అయినా ఆమెకి తెలుగులో ఇంకో పెద్ద ఆఫర్ రాలేదు. అందుకే కాబోలు ఇప్పుడు ఈ భామ స్టయిలింగ్ పై దృష్టి పెట్టింది.
GALLERY: Aishwarya Rajesh life’s beautiful little moments
ఐశ్వర్య రాజేష్ కెరీర్లో అతిపెద్ద హిట్ చిత్రం… సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ సరసన భార్యగా నటించింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఏడాదిన్నర అయిపోయింది. అంత పెద్ద హిట్ చిత్రంలో నటిస్తే కేవలం తిరువూరు సరసన ఒక చిత్రంలో అవకాశం దక్కింది.
పెద్ద హీరోల చిత్రాల్లో కానీ, మిడ్ రేంజ్ హీరోల చిత్రాల్లో కానీ, ఇతర సీనియర్ హీరోల సినిమాల్లో కానీ ఆమెకి ఒక్క ఆఫర్ రాలేదు.
సో, ఈ భామ కూడా ట్రెండీ గా కనిపించేందుకు తనని తాను గ్రూమ్ చేసుకొని ఎప్పటికప్పుడు స్టయిలిష్ ఫోటోషూట్ లు చేస్తూ, వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. సినిమాలు రాకపోయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటే బ్రాండ్స్, షోరూం ఓపెనింగ్ ల ద్వారా బాగానే సంపాదించొచ్చు. అందుకే, ఇప్పుడు అటువైపు ఫోకస్ తిప్పింది.