మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగ తాగడం వల్ల బాడీ చల్లగా మారుతుందని డాక్టర్ శ్రీమతి వాణి కృష్ణ, న్యూట్రిషనిస్ట్, స్పర్ష్ హాస్పిటల్, బెంగళూరు
తెలిపారు.
పుచ్చకాయలో 90 శాతం పైగా నీరు ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శక్తి లభిస్తుంది. ఒంట్లో వేడి తగ్గుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కీరదోసలో నీటితో పాటు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కీరదోస తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కర్బూజాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది. కర్బూజా తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
పుదీనాలోని ఔషధ గుణాలు బాడీని సహజంగా కూల్ చేస్తాయి. పుదీనా జ్యూస్, పుదీనా ఆకుల్ని మజ్జిగలో కలిపి తాగడం వల్ల ఒంట్లో వేడి వేగంగా తగ్గుతుంది.
సొరకాయలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. సొరకాయ తినడం వల్ల బాడీ కూల్ అవుతుంది. సొరకాయ ఈజీగా జీర్ణం అవుతుంది.
నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నారింజ తినడం వల్ల ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. ఒంట్లో వేడి తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది.
నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. నిమ్మరసం తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒంట్లో వేడి తగ్గుతుంది.